త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కె. నవీన్ కుమార్ ప్రెస్ నోట్ ద్వారా స్పష్టతనిచ్చారు.

J

Telangana | Published On Sep 16, 2026, 6.03 pm IST

BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు

సంక్షిప్త సారాంశం

తన భూముల గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కె.నవీన్ కుమార్ స్పందించారు. తాను ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించానని తెలిపారు. మెజారిటీ భూములు 2014కు ముందే చట్టబద్ధంగా కొనుగోలు చేసినవని స్పష్టం చేశారు. తమ కుటుంబ భూములకు ధరణి ఎంట్రీలతో గానీ, 22A నిషేధిత జాబితాతో గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

Advertisement
  • మా భూములకు 22Aతో ఎలాంటి సంబంధం లేదు
  • ఆ భూములన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 2014కు పూర్వమే కొనుగోలు చేశాం
  • సీఎం వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్

BRS MLC Naveen Kumar Lands | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురించి, తన తండ్రి కె. కొండల్ రావు గురించి, తమ కుటుంబ ఆస్తుల భూముల విషయంలో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కె. నవీన్ కుమార్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను స్పష్టం చేస్తూ వివరణ ఇచ్చారు.

చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తులే

తాను 2019లో.. ఆ తర్వాత 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాానని, ఎన్నికల సమయంలో చట్టప్రకారమే తన ఆస్తులు, భూముల వివరాలను అధికారికంగా ప్రకటించినట్లు నవీన్ కుమార్ తెలిపారు. తన పేరుతో ఉన్న మెజారిటీ భూములు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే, అంటే 2014కు పూర్వమే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అప్పట్లో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారమే వాటిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, అలాగే తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న భూములు కూడా చట్టబద్ధమైనవేనని స్పష్టం చేశారు.

ధరణి, 22A జాబితాతో సంబంధం లేదు

తమ కుటుంబానికి చెందిన భూములకు ధరణి ఎంట్రీలతో లేదా 22A నిషేధిత భూముల జాబితాతో ఎలాంటి సంబంధం లేదని నవీన్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి.. సిద్దిపేట జిల్లాలో కూడా తమ కుటుంబానికి భూములు ఉన్నట్లు పేర్కొన్నారని, అయితే తనకు సిద్దిపేట జిల్లాలో ఎలాంటి భూమి లేదని తేల్చిచెప్పారు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో తమ కుటుంబానికి ఉన్న భూములకు సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు, అధికారిక రికార్డులు పక్కాగా ఉన్నాయని తెలిపారు.

ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా ఆస్తులను దాచాల్సిన అవసరం తనకు లేదని, సీఎం వ్యాఖ్యలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, ఎక్కడైనా తప్పు జరిగితే అధికారిక రికార్డుల ద్వారా నిరూపించాలని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సవాల్ విసిరారు.

Advertisement
Advertisement