CJP Protests | జంతర్ మంతర్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీజేపీపై అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు
CJP Protests | బీజేపీపై కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి చెందిన కొందరు తమ గుంపులోకి చొరబడి.. నిరసనలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులపై రాళ్లు విసురుతున్నది బీజేపీకి చెందిన గూండాలేనని పేర్కొన్నారు.
CJP Protests | ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద అర్ధరాత్రి మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులు (CJP Protests), భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో జంతర్ మంతర్ వద్ద భారీగా గుమిగూడిన సీజేపీ మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులతో సహా ఆరుగురు పోలీసు సిబ్బంది గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ మేరకు రాత్రి ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేశారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతూ, వాగ్వాదానికి దిగినట్లు ఆ వీడియోల ద్వారా తెలుస్తోంది. భద్రతా సిబ్బందిని చుట్టుముట్టి నిరసనకారులు దాడి చేశారు. గాయపడిన ఏసీపీలు వివేక్ భగత్, జయ ప్రకాష్‌లను చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
బీజేపీనే గూండాలతో దాడి చేయిస్తోంది.. దిప్కే
అర్థరాత్రి జరిగిన నిరసనలపై కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్పందించారు. ఈ మేరకు బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాము శాంతియుతంగానే నిరసనలు చేపట్టినట్లు చెప్పారు. కానీ తమ నిరసనలను ఉద్దేశపూర్వకంగానే హింసాత్మకంగా మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీకి చెందిన కొందరు తమ గుంపులోకి చొరబడి.. నిరసనలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ గూండాలను పంపి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై దాడులు చేయిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులపై రాళ్లు విసురుతున్నది బీజేపీకి చెందిన గూండాలేనని పేర్కొన్నారు. "పోలీసులు ఇక్కడికి ట్రక్కుల కొద్దీ రాళ్లను తెప్పిస్తారు. బీజేపీ గూండాలు వచ్చి రాళ్లు విసిరి.. ఆ నిందలను సీజేపీ కార్యకర్తలపై వేస్తారు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది" అంటూ దిప్కే సంచలన ఆరోపణలు చేశారు. ఏం చేసినా ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసేవరకూ తమ నిరసనలు ఆగవని ఆయన స్పష్టం చేశారు.
Also Read..
మిస్టర్ చీప్ మినిస్టర్.. బురదలో కుస్తీ పట్టడం నాకు ఇష్టం లేదు: కేటీఆర్
ఆగని నిరసనలు.. ఉభయసభలు వాయిదా
పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. ప్రధాని కీలక ప్రకటన
సంబంధిత వార్తలు

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
సెప్టెంబర్ 9, 2026

Etala Rajendar | దేశం విచ్ఛిన్నం కావాలని.. ఎన్నో దేశాలు సీజేపీకి నిధులిస్తున్నయ్
ఆగస్టు 30, 2026

Instagram Engagement | జెన్‌జీ నిరసనల తర్వాత.. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఎంగేజ్మెంట్.. 289.9% వృద్ధి
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
- ●Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం
- ●BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి

Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్

Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం



