త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్ నుంచి పిల్ల‌ల్ని ర‌క్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court | చిన్నారుల సోష‌ల్ మీడియా వినియోగానికి త‌ల్లిదండ్రుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ పిటిష‌న్‌పై చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచారించింది. ఈ సంద‌ర్భంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

D

National | Published On Sep 10, 2026, 2.56 pm IST

Supreme Court | ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్ నుంచి పిల్ల‌ల్ని ర‌క్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్ : ఆన్‌లైన్ వేదికలపై పిల్లల భద్రతకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. సోష‌ల్ మీడియా, ఇత‌ర డిజిటిల్ వేదిక‌ల‌పై లైంగిక వేధింపులు, అనుచిత కంటెంట్ నుంచి పిల్ల‌ల్ని ర‌క్షించేందుకు బ‌ల‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు కోరుతూ ఓ స్వ‌చ్ఛంద సంస్థ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

ఈ పిటిష‌న్‌పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌ (CJI Surya Kant), జ‌స్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జ‌స్టిస్ వి.మోహ‌నాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది. పిల్లల భద్రత కోసం డిజిటల్ వేదికలపై ఫైర్‌వాల్స్ చాలా అవసరం అని ధ‌ర్మాస‌నం తెలిపింది. అంతేకాదు భారతదేశంలో పిల్లల కోసం కొన్ని బలమైన రక్షణ చర్యలు (Safeguards) ఉండాలని అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు వివ‌ర‌ణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయన్స్ (Just Rights for Children Alliance) అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిష‌న్‌ను దాఖలు చేసింది. సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మైనర్లకు తగిన రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ వంటి సంస్థలు 13 ఏళ్ల నుంచే ఖాతాలు తెర‌వ‌డానికి అనుమతిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. భారతీయ చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు వారు మైనర్లుగా పరిగణించబడతారని పేర్కొంది. సమాచార సాంకేతిక (ఐటీ) నిబంధనలు-2021కి తగిన సవరణలు చేసి మైన‌ర్లు నేరుగా సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల‌తో ఒప్పందాలు చేసుకోకుండా నిరోధించాల‌ని కోరింది. మైన‌ర్ల ఖాతాల‌కు త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్షకుల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలని విజ్ఞ‌ప్తి చేసింది.

Also Read..

బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం

సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న‌ 80s ట్రెండ్‌.. వింటేజ్ లుక్‌లో ప్ర‌ధాని మోదీ, రాహుల్‌..

రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Advertisement
Advertisement