త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నిషేధిత భూముల‌పై బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అక్ష‌ర స‌త్యం

Harish Rao | రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాపై బీఆర్ఎస్ చేసిన ఆరోప‌ణ‌లు అక్ష‌ర స‌త్య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌తో రుజువైంద‌ని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్లు ద‌బాద‌బా సంత‌కాలు చేయ‌డంతో.. నిషేధిత భూములు 30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు చేరాయ‌ని సీఎం పేర్కొన్నార‌ని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Sep 16, 2026, 6.58 pm IST

Harish Rao | నిషేధిత భూముల‌పై బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అక్ష‌ర స‌త్యం
Advertisement

శాస‌న‌స‌భ వేదిక‌గా సీఎం రేవంత్ మాట‌ల‌తో రుజువైంది
ఈ ప్ర‌భుత్వం చ‌ర్య‌తో ల‌క్ష‌ల కుటుంబాలు ఆగ‌మైన‌య్
స‌భ‌లో సీఎం వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాపై బీఆర్ఎస్ చేసిన ఆరోప‌ణ‌లు అక్ష‌ర స‌త్య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌తో రుజువైంద‌ని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్లు ద‌బాద‌బా సంత‌కాలు చేయ‌డంతో.. నిషేధిత భూములు 30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు చేరాయ‌ని సీఎం పేర్కొన్నార‌ని ఆయ‌న తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త ప‌రిస్థితులు తలెత్తాయ‌ని సీఎం వ్యాఖ్యానించార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. సీఎం రేవంత్ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

నిషేధిత జాబితాపై బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అక్ష‌ర స‌త్య‌మ‌ని సీఎం మాట‌ల‌తో రుజువైంది. మేం 3 ల‌క్ష‌ల 71 వేల ఎక‌రాలు నిసేధిత జాబితాలో పెట్టినం.. కానీ స‌బ్ రిజిస్ట్రార్లు ఎక్క‌డిక‌క్క‌డ ఆపేశారు. కొన్నిచోట్ల స‌బ్ రిజిస్ట్రార్ల‌ను స‌స్పెండ్ చేశాం. దాంతో స‌మ‌స్య 30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పెరిగింద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక స‌ర్వే నంబ‌ర్‌లో 10 ఎక‌రాలు ఉంటే మొత్తం స‌ర్వే నంబ‌ర్‌ను నిషేధిత జాబితాలో పెట్టారు. ఇదే క‌దా మేం చెప్పింది. 3 ల‌క్ష‌ల ఎక‌రాల్లో స‌మ‌స్య ఉంటే 30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పాకింది. ఒక ఎక‌రంలో కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి. ల‌క్ష‌ల కుటుంబాలు ఆగ‌మైన‌యి.. దీనిపై ఎందుకు స‌మాధానం చెప్ప‌వ్ రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

మీ ప్ర‌భుత్వ త‌ప్పిద‌మే క‌దా..?

స‌బ్ రిజిస్ట్రార్ల‌ను స‌స్పెండ్ చేశారంటే మీ ప్ర‌భుత్వ త‌ప్పిద‌మే క‌దా..? హైకోర్టు క‌టాఫ్ డేట్ ఇచ్చింది. స‌బ్ రిజిస్ట్రార్ల‌ను, క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించినం.. వారు చూసుకోకుండా ద‌బ‌ద‌బా సంత‌కం పెట్టి అప్‌లోడ్ చేశార‌ని సీఎం అన్నారు. సంత‌కాలు పెట్టిన క‌లెక్ట‌ర్లపై, త‌ప్పు చేసిన అధికారుల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

పొంగులేటిపై చ‌ర్య‌లేవి..?

నిషేధిత భూముల‌పై ఎన్ని బుకాయిస్తారు. ఒక్క ఎక‌రాను కూడా మా కాంగ్రెస్ వ‌చ్చాక నిషేధిత జాబితాలో పెట్ట‌లేద‌ని పొంగులేటి అన్నారు. 30 ల‌క్ష‌ల ఎక‌రాలు పెట్టిన‌ట్టు సీఎం అన్నారు. ఎవ‌రిది క‌రెక్ట్.. పొంగులేటిపై చ‌ర్య‌లేవి..? హెచ్ఎండీఏ, యూఎల్సీ, ప్ర‌భుత్వం అమ్మిన భూములు కూడా అప్‌లోడ్ చేయ‌డం వ‌ల్ల ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డ్డ‌ద‌ని సీఎం చెప్పారు. కార‌కులు నీ ప్ర‌భుత్వం కాదా..? 1999లో త‌యారు చేసిన నిసేధిత జాబితాను అప్‌లోడ్ చేశార‌ని చెప్పారు. 1999 నుంచి 2026 దాకా ప్ర‌భుత్వం అలాట్, యాక్ష‌న్ చేసి ఉంట‌ది.. అవ‌న్నీ పెట్ట‌డం త‌ప్పిదం కాదా.. అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

స‌మాధానం లేక నా మీద ఎదురుదాడి చేస్తున్నావు

22ఏ భూముల వ్య‌వ‌హారంపై బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పి చెంప‌లు వేసుకుని ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిలోగా స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తావో స‌మాధానం చెప్పాలి. అది చెప్ప‌కుండా ఉల్టా ద‌బాయించుడు ఏంది.. సీఎంకు ప్ర‌త్యేక‌మైన చ‌ట్టం ఉండ‌దు. అంద‌రికీ చ‌ట్టం ఒక్క‌టే. నిషేధిత జాబితా నుంచి రాత్రికి రాత్రి నీ ఇల్లు తీసిన‌వో.. అలాగే ప్ర‌జ‌ల భూముల‌ను 22ఏ నుంచి తొల‌గించాల‌న్న‌ది నా బాధ‌. నీది పెడితే ఏంది.. పోతే ఏంది.. నీకు ఏ చ‌ట్టం వ‌ర్తిస్త‌దో.. రాష్ట్ర ప్ర‌జ‌లకు అదే వ‌ర్తిస్తుంది.. నీ విష‌యం బ‌య‌ట‌పెట్టినందుకు నీకు ఉక్రోషం, త‌ట్టుకోలేపోతున్నావు. స‌మాధానం లేక నా మీద ఎదురుదాడి చేస్తున్నావు. మా బాధ ప్ర‌జ‌ల బాధ అని హ‌రీశ్‌రావు తెలిపారు.

నువ్వు సీఎం అయ్యేవాడివా..?

తెలంగాణ ఉద్య‌మం లేక‌పోతే, కేసీఆర్ పోరాటం చేయ‌క‌పోతే రాష్ట్రం వ‌చ్చేదా..? నువ్వు సీఎం అయ్యేవాడివా..? ప్రాణాల‌కు తెగించి చావు నోట్లో పెట్టి తెస్తే బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. 22ఏ భూముల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశాం. ఎన్ని భూములు నిషేధిత జాబితాలో పెట్టింది..? ఎన్ని తొల‌గించింది..? 2023 డిసెంబ‌ర్ 7 నుంచి ఈ రోజు వ‌ర‌కు నిషేధిత జాబితాను ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టండి అంటే స‌మాధానం లేదు. సిట్టింగ్ జ‌డ్జి చేత విచార‌ణ జ‌రిపించ‌మంటే స‌మాధానం లేదు. స్ప‌ష్ట‌మైన తేదీ చెప్పండి అంటే క‌మిటీలు అని త‌ప్పించుకున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేత‌ల మీద ఎదురుదాడి చేసి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

గ‌న్‌మెన్లు, పోలీసులు వ‌ద్దు..

బీఆర్ఎస్ ఉన్న‌ప్పుడు రిజిస్ట్రేష‌న్లు జ‌రిగాయి. కాంగ్రెస్ వ‌చ్చాక రిజ‌స్ట్రేష‌న్లు ఆగిపోయాయిని ప్ర‌జ‌లే చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వ‌స్తాడా.. పొంగులేటి వ‌స్తాడా.. కుత్బుల్లాపూర్ పోదామా..? ప‌టాన్ చెరు పోదామా.. మంచిర్యాల పోదామా.. మాట్లాడుకుందాం.. గ‌న్‌మెన్లు, పోలీసులు వ‌ద్దు.. ఆలేరు పోదామా.. యాద‌గిరిగుట్ట‌కు పోదామా.. 22ఏ నిషేధిత జాబితా మా ప్ర‌భుత్వం తెచ్చింద‌ని బీర్ల ఐల‌య్య, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చెప్పిండు. ఎంత‌సేపు బీఆర్ఎస్‌పై ఎదురుదాడి చేసి త‌ప్పించుకుంటావు అని హ‌రీశ్‌రావు అడిగారు.

Advertisement
Advertisement