త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fact Check | ఫ్యాక్ట్ చెక్‌.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్‌.. కేంద్రం క్లారిటీ..

Fact Check | ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గెజిట్‌ నోటిఫికేషన్‌ నకిలీదని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.

S

Business | Published On Sep 16, 2026, 5.53 pm IST

Fact Check | ఫ్యాక్ట్ చెక్‌.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్‌.. కేంద్రం క్లారిటీ..
Advertisement

Fact Check | ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గెజిట్‌ నోటిఫికేషన్‌ నకిలీదని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ పత్రం నకిలీద‌ని, దీనిని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక హ్యాండిల్‌ జారీ చేయలేద‌ని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సమాచారాన్ని నమ్మే ముందు, ఇతరులకు షేర్ చేసే ముందు అధికారిక, విశ్వసనీయ వర్గాల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించింది. ప్రభుత్వం పేరుతో జారీ చేసినట్లుగా కనిపిస్తున్న అనుమానాస్పద సమాచారాన్ని గుర్తించిన వారు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ అధికారిక ఎక్స్‌ ఖాతాకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. అలాగే +91 8799711259 మొబైల్‌ నంబర్‌ లేదా factcheck@pib.gov.in ఈ-మెయిల్‌ ద్వారా కూడా సమాచారాన్ని పంపవచ్చని పేర్కొంది.

https://twitter.com/PIBFactCheck/status/2100152907236815115

న‌కిలీ గెజిట్‌లో ఏముంది..?

వైరల్‌ అయిన నకిలీ గెజిట్‌ ప్రకారం ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుని, వాటిని ఎస్‌బీఐ గ్రూప్ గా పేరు మార్చనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో విలీనం చేసి అదే పేరుతో కొనసాగించనున్నట్లు ఆ నకిలీ పత్రంలో పేర్కొన్నారు. ఇక కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేసి, అదే పేరుతో కొనసాగించనున్నట్లు కూడా ఆ గెజిట్‌లో పేర్కొన్నారు.

అయితే ఈ విలీనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయలేదని స్పష్టం చేసింది. కాబట్టి ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి పత్రాలు, పోస్టులను అధికారిక వర్గాల ధ్రువీకరణ లేకుండా నమ్మడం లేదా షేర్ చేయడం చేయకూడదని కేంద్రం సూచించింది.

Advertisement
Advertisement