త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Elections | రెండు ఎమ్మెల్సీలు గెలిపించండి.. ఆశావ‌హులతో టీ పీసీసీ చీఫ్

MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించిన అభ్యర్థులతో టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శ‌నివారం గాంధీ భ‌వ‌న్‌లో స‌మావేశం అయ్యారు.

S

Telangana | Published On Oct 3, 2026, 3.49 pm IST

MLC Elections | రెండు ఎమ్మెల్సీలు గెలిపించండి.. ఆశావ‌హులతో టీ పీసీసీ చీఫ్
Advertisement

MLC Elections | త్రినేత్ర న్యూస్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించిన అభ్యర్థులతో టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శ‌నివారం గాంధీ భ‌వ‌న్‌లో స‌మావేశం అయ్యారు. అంత కలిసికట్టుగా పని చేసి రెండు సీట్లు గెలించాలని భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని ఆయ‌న చెప్పారు. వ‌రంగ‌ల్ - ఖ‌మ్మం - న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భద్రుల స్థానానికి రాంరెడ్డి స‌ర్వోత్తం రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - రంగారెడ్డి - హైద‌రాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సామ రామ్మోహ‌న్ రెడ్డి పేర్ల‌ను కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ కార్య‌క్ర‌మంలో చ‌న‌గాని ద‌యాక‌ర్, లోకేశ్, అనిల్, గౌరి స‌తీశ్‌, వేణుగోపాల్ రెడ్డితో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement