Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో మోదీ చాలీసా విడుదల
Modi Chalisa | ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ (Delhi Press Club)లో ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) కీర్తిస్తూ కొందరు అభిమానులు ‘మోదీ చాలీసా’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు జై జై మోదీ.. హర హర మోదీ అంటూ చాలీసాను పఠించారు.
Modi Chalisa | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ (Delhi Press Club)లో ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) కీర్తిస్తూ కొందరు అభిమానులు ‘మోదీ చాలీసా’ను విడుదల చేశారు. మోదీపై అభిమానంతో రూపొందించిన ఈ ‘మోదీ చాలీసా’ (Modi Chalisa)ను భారతీయ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు జై జై మోదీ.. హర హర మోదీ అంటూ చాలీసాను పఠించారు. ఈ కార్యక్రమంలో బీహార్ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ సంక్షేమ మండలి సభ్యులైన డాక్టర్ రాజన్ సింగ్, మహామండలేశ్వర్ వైభవి మహారాజ్‌తో సహా ఆ వర్గానికి చెందిన సభ్యులు హాజరయ్యారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభిమానం పేరుతో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.

కాగా, గతంలోనూ చాలా మోదీ చాలీసాలు విడుదలైన విషయం తెలిసిందే. ప్రధానిపై అభిమానంతో కొందరు భక్తులు, అభిమానులు వివిధ సందర్భాల్లో 'మోదీ చాలీసా' రూపంలో కీర్తనలు రచించి విడుదల చేశారు. మోదీ పాలనను, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన కీర్తనలు తొలిసారి 2015లో వారణాసిలో వెలుగులోకి వచ్చాయి. ముద్రిత ప్రతులు, కరపత్రాలను అభిమానులు బహిరంగంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత 2016లో మోదీ చాలీసాలు అధికారిక వీడియో, ఆడియో వెర్షన్లు కూడా విడుదలయ్యాయి. వాటికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. మే 2024-జూలై 2026 మధ్య కాలంలో వివిధ ప్రముఖ డిజిటల్ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో డాక్టర్ సుదేశ్ కుమార్ తల్హేటా వెర్షన్, ఆపిల్ మ్యూజిక్‌లో రాధే శ్యామ్ రసియా సింగిల్ వర్షెన్లు కూడా విడుదలయ్యాయి.
Prime minster narender modi chalisa released pic.twitter.com/UvitQKvzZT
— Brajesh Tiwari (@brajeshtiwari_7) August 20, 2026
Also Read..
స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా
ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
ఆగస్టు 19, 2026

Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్
ఆగస్టు 18, 2026

Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!
- ●Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా
- ●Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా..?
- ●Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే
- ●Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!

Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా

Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా..?

Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే



