త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.ల‌క్ష ప్రైజ్‌మ‌నీ.. ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ల‌కు బీహార్ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌

Bihar Government | సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ల‌కు బీహార్ ప్ర‌భుత్వం (Bihar Government) బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేసే రిజిస్ట‌ర్డ్ కంటెంట్ క్రియేట‌ర్ల‌కు భారీ ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించింది. అలాంటి వారికి రూ.ల‌క్ష న‌గ‌దు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.

D

National | Published On Aug 20, 2026, 1.55 pm IST

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.ల‌క్ష ప్రైజ్‌మ‌నీ.. ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ల‌కు బీహార్ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌
Advertisement

Bihar Government | త్రినేత్ర‌.న్యూస్ : సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్లు, కంటెంట్ క్రియేట‌ర్ల‌కు (social media creators) బీహార్‌లోని సామ్రాట్ చౌద‌రి ప్ర‌భుత్వం (Bihar Government) బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వీడియోలు చేసి వాటిని వైర‌ల్ చేయాల‌ని సూచించింది. అలా వైర‌ల్ అయిన వీడియోలకు రూ.ల‌క్ష వ‌ర‌కూ న‌గ‌దు బ‌హుమ‌తి అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 'బీహార్ సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ మీడియా నియమావళి, 2026' సవరణలకు ఆమోదం లభించింది. దీని ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వీడియోలు రూపొందించి వైరల్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి ల‌క్ష వ్యూస్‌కు రూ.10,000 చెల్లిస్తారు. మొత్తంగా 10 ల‌క్ష‌ల వీక్ష‌ణ‌లు వ‌చ్చిన వీడియోకి రూ.ల‌క్ష బ‌హుమ‌తి అందిస్తారు.

వీడియో అప్‌లోడ్ చేసిన 30 రోజుల తర్వాత వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ నగదును లెక్కిస్తారు. వీడియోకి ప‌ది ల‌క్ష‌ల వ్యూస్ దాటినా న‌గ‌దు బ‌హుమ‌తి రూ.ల‌క్ష‌ల‌కే ప‌రిమితం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగా రూపొందించిన కంటెంట్‌కు మాత్రమే ఈ ప్రోత్సాహకం అందుతుంది. వీడియో ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రచురించారు, దాని కంటెంట్‌ నాణ్యత ఎలా ఉంది, అందులో నమోదైన వీక్షణలు నిజమైనవేనా అనే అంశాలను అధికారికంగా పరిశీలించిన తర్వాతే చెల్లింపులు జ‌రుగుతాయి.

అదేవిధంగా ఈ ఆఫ‌ర్ అర్హులైన వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ముందే రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ (IPRD) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంపానెల్ అయి ఉండాలి. ఈ విభాగం నుంచి అవసరమైన అనుమతి తీసుకోకుండా రూపొందించే వీడియోలను నగదు బహుమతి కోసం పరిగణనలోకి తీసుకోరు. ప్రభుత్వం వద్ద నమోదైన క్రియేటర్ల సోషల్‌ మీడియా ఖాతాలు, యూట్యూబ్‌ లేదా ఇతర ఛానెళ్లను, ఆయా ఖాతాలకు ఉన్న ఫాలోవర్ల సంఖ్యను అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు పర్యవేక్షిస్తారు.

Also Read..

4 నెల‌ల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జ‌డ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్య‌క్తిగ‌త mRNA" వ్యాక్సిన్

పీక‌ల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరిన‌ ప్ర‌భుత్వ రుణం..

Advertisement
Advertisement