PM Modi | భారత్ చొరవతోనే యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు : ప్రధాని మోదీ
PM Modi | భారత్ తీసుకున్న చొరవ కారణంగా యోగా (Yoga) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : భారత్ తీసుకున్న చొరవ కారణంగా యోగా (Yoga) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. తాను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రపంచ దేశాధినేతలు కూడా యోగా గురించే తనతో ఎక్కువగా చర్చిస్తారని చెప్పారు. కర్ణాటకలోని స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ ప్రధాన కార్యాలయం ప్రశాంతి కుటీరం (Prasanthi Kutiram) స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
యోగా ప్రాముఖ్యత, అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాఫ్ట్ పవర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నేను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు, అతిథులతో జరిగే విందు సమావేశాల్లో యోగా గురించే ఎక్కువగా చర్చకు వస్తుంది. నేను యోగా గురువును కాదని, కేవలం యోగ సాధకుడిని మాత్రమేనని వారికి వివరించాల్సి వచ్చేది. దాంతో వారు యోగా గురించి నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగేవారు" అని ప్రధాని చెప్పుకొచ్చారు.
చాలా మంది ప్రముఖ దేశాధినేతల కుటుంబ సభ్యులు యోగా నేర్చుకునేందుకు భారత్‌కు వస్తున్నారని ప్రధాని తెలిపారు. కొందరు యోగా సాధన చేస్తూ ఇతరులకు కూడా నేర్పిస్తున్నారని చెప్పారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, యోగా అనేది భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రధాన మార్గంగా మారిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కేవలం ఆరోగ్య రక్షణ, ఒత్తిడి తగ్గించుకోవడానికే కాకుండా.. అనేక మంది విదేశీ రాయబారులు, దేశాధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు తమ సొంత వర్గాల్లో యోగాను ప్రచారం చేయడంతోపాటూ బోధించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.
గల్ఫ్ దేశాల్లోనూ యోగా పట్ల విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ఖతార్ నేతలు భారత్ చేపట్టిన ప్రపంచ యోగా కార్యక్రమాలను ప్రశంసించడంతో పాటు, దోహాలో యోగా సమావేశాలను నిర్వహించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. అలాగే గల్ఫ్ దేశాల రాజ కుటుంబాలకు చెందిన వారు కూడా యోగా వెల్నెస్ సెంటర్లను నిర్వహిస్తూ, ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఒక సాధారణ యోగా కేంద్రంగా మొదలై, 50 ఏళ్లలో ప్రపంచ స్థాయి ఉద్యమంగా మారిన ప్రశాంతి కుటీరం ప్రయాణాన్ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.
Also Read..
క్షయ వ్యాధి నిర్మూలనలో భారత్ కీలక మైలురాయి.. 10 ఏళ్లలో 38 శాతం తగ్గిన మరణాలు.. WHO రిపోర్ట్
పదిహేడేళ్ల తర్వాత తెలుగు డైరెక్టర్‌తో కంగనా రనౌత్ మూవీ - హిట్టు కోసం హారర్ బాట
క్యూ2 ఫలితాలతో ఎంఎస్‌టీసీ షేర్లకు జోష్.. 6 నెలల్లో 81 శాతం లాభాలు..
సంబంధిత వార్తలు

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
నవంబర్ 14, 2026

Abki Baar AQI 400-Paar | ‘అబ్ కీ బార్, ఏక్యూఐ 400-పార్’.. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
నవంబర్ 14, 2026

Sam Pitroda | ప్రధాని ఫోన్లను ట్యాప్ చేయరు.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!



