TB Mortality | క్షయ వ్యాధి నిర్మూలనలో భారత్ కీలక మైలురాయి.. 10 ఏళ్లలో 38 శాతం తగ్గిన మరణాలు.. WHO రిపోర్ట్
TB Mortality | క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలన (tuberculosis) పోరులో భారతదేశం ఒక కీలక మైలురాయిని అధిగమించింది. గత పదేళ్లలో మరణాల సంఖ్య (TB Mortality) భారీగా తగ్గింది. 2015 నుంచి 2025 మధ్య కాలంలో భారతదేశంలో టీబీ మరణాల రేటు 38 శాతం తగ్గాయి.
TB Mortality | త్రినేత్ర న్యూస్ : క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలన (tuberculosis) పోరులో భారతదేశం ఒక కీలక మైలురాయిని అధిగమించింది. గత పదేళ్లలో మరణాల సంఖ్య (TB Mortality) భారీగా తగ్గింది. 2015 నుంచి 2025 మధ్య కాలంలో భారతదేశంలో టీబీ మరణాల రేటు 38 శాతం తగ్గాయి. ఇది ప్రపంచ సగటు 35 శాతం క్షీణతతో మెరుగైన ఫలితాలను సాధించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. WHO విడుదల చేసిన 'గ్లోబల్ ట్యూబర్‌క్యులోసిస్ రిపోర్ట్ 2026' ప్రకారం.. 2015లో ప్రతి లక్ష జనాభాకు 28గా ఉన్న టీబీ మరణాల రేటు, 2025 నాటికి 18కి తగ్గింది. అంతేకాదు.. సాధారణ ఔషధాలకు లొంగే క్షయ వ్యాధి ఉన్న రోగుల్లో చికిత్స విజయవంతం అయ్యే రేటు 94 శాతంగా ఉండటం విశేషం.
2030 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వ్యాధి లక్షణాలున్నవారిని గుర్తించి వెంటనే చికిత్స అందించేందుకు జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (NTEP), ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కింద 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 347 అధిక ప్రాధాన్యత గల జిల్లాలలో 2024 డిసెంబర్ 7 నుంచి 2026 నవంబర్ 8 మధ్య భారీ ఎత్తున స్క్రీనింగ్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా ప్రజలకు ముందస్తు టీబీ పరీక్షలు నిర్వహించారు. వ్యాధిని త్వరగా గుర్తించేందుకు 11 కోట్లకు పైగా ఛాతీ ఎక్స్-రేలు (Chest X-rays), 3 కోట్లకు పైగా మాలిక్యులర్ (NAAT) పరీక్షలు చేశారు. ముమ్మర స్క్రీనింగ్ ద్వారా మొత్తం 48.64 లక్షల కొత్త టీబీ కేసులను గుర్తించగా, ఇందులో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని (Asymptomatic) 14.97 లక్షల కేసులు ఉండటం విశేషం.

అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం..
ఎర్లీ డిటెక్షన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఎక్స్-రేలు, రాపిడ్ డయాగ్నోస్టిక్స్, ఖుషి-ఏఐ చాట్‌బాట్, అవతార్ వీడియోబాట్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించారు. రోగుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, చికిత్స నిరంతరాయంగా కొనసాగేలా చూడటానికి Ni-kshay డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఎంతగానో తోడ్పడింది. ‘ని-క్షయ్ పోషణ్ యోజన’ కింద రోగులకు చికిత్స సమయంలో పౌష్టికాహారం కోసం నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అలాగే ‘ని-క్షయ్ మిత్ర’ కార్యక్రమం ద్వారా దాతలు, సంస్థలు రోగులకు అండగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రారంభమైన 'టీబీ ముక్త భారత్ అభియాన్' ఒక జన ఉద్యోగ్‌గా (Jan Andolan) మారి గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు, యువజన సంఘాల (NCC, MY Bharat వాలంటీర్లు) భాగస్వామ్యంతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. 2025 నాటికి దేశంలో 67,933 పంచాయతీలను టీబీ రహితంగా ప్రకటించారు.
ఆర్థికంగా స్వయం సమృద్ధి..
మరో విశేషం ఏంటంటే.. భారత్ తన క్షయవ్యాధి (TB) నివారణ కార్యక్రమాలకు అవసరమైన నిధుల్లో 96 శాతం నిధులను దేశీయ వనరుల నుంచే సమకూర్చుకుంటూ ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించింది. విదేశీ సహాయంపై ఆధారపడకుండా దేశీయంగానే నిధులను కేటాయించడం ద్వారా టీబీ రహిత భారత్ (TB-Mukt Bharat) లక్ష్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తోంది.
అయినప్పటికీ.. 25% వాటాతో భారత్ ఫస్ట్ ప్లేస్‌లో
ఇంతటి పురోగతి సాధించినప్పటికీ.. 2025లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కొత్త టీబీ కేసుల్లో 25% వాటాతో భారత్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.06 కోట్ల మంది కొత్తగా టీబీ బారిన పడ్డారు. ఇందులో 57 లక్షల మంది పురుషులు, 37 లక్షల మంది మహిళలు, 12 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో మూడింట రెండు వంతులు అంటే 67% కేసులు కేవలం ఎనిమిది దేశాల్లోనే నమోదవడం గమనార్హం. ఈ జాబితాలో భారతదేశం 25.3 లక్షల కొత్త టీబీ కేసులతో (25%) మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా (10%), ఫిలిప్పీన్స్ (6.8%), చైనా (6.5%), పాకిస్థాన్ (6.4%), నైజీరియా (4.9%), డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (3.9%), బంగ్లాదేశ్ (3.7%) ఉన్నాయి. ఇక గతేడాది క్షయ వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 11.3 లక్షల మంది మరణించారు. ఇందులో హెచ్‌ఐవీ (HIV) బాధితులు 1.37 లక్షల మంది ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ వెల్లడించింది.

Also Read..
అంతర్జాతీయ సదస్సులను రాజకీయ కోణంలో చూడొద్దు: ఎంపీ చామల
ఉనికిని చాటుకునేందుకే రాహుల్‌పై విమర్శలు.. బీజేపీ, కేటీఆర్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hantavirus | ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. ‘హంటా’.. ఏంటిది, ఎలా వ్యాప్తి చెందుతుంది..?
మే 8, 2026

Covid 19 | కోవిడ్-19 కొత్త వేరియెంట్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆందోళన వద్దన్న WHO..
మార్చి 27, 2026

President Droupadi Murmu | క్షయవ్యాధి నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు
మార్చి 24, 2026
తాజావార్తలు
- ●Ayodhya | అయోధ్య రామమందిరంలో మారిన సేవలు.. రామ్‌లల్లాకు వేడి పాలు, వెచ్చని దుస్తులు!
- ●Horoscope | నవంబర్ 14 రాశిఫలాలు.. కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తారు!
- ●Delhi Pollution | ఢిల్లీలో విషవాయువులు.. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే 20 రెట్లు అధికంగా కాలుష్యం!
- ●Vikarabad | అండర్-19 జట్టుకు ఎంపికైనా.. అంతలోనే విషాదం!
- ●Poonam Bajwa | బికినీలో టాలీవుడ్ హీరోయిన్ - తడి అందాలతో హీటేక్కిస్తున్న బ్యూటీ
- ●ICC Player of the Month Award | ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దీప్తి శర్మ..

Ayodhya | అయోధ్య రామమందిరంలో మారిన సేవలు.. రామ్‌లల్లాకు వేడి పాలు, వెచ్చని దుస్తులు!

Horoscope | నవంబర్ 14 రాశిఫలాలు.. కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తారు!

Delhi Pollution | ఢిల్లీలో విషవాయువులు.. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే 20 రెట్లు అధికంగా కాలుష్యం!

Vikarabad | అండర్-19 జట్టుకు ఎంపికైనా.. అంతలోనే విషాదం!



