త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవ‌లు.. సాయంత్రానికి సాధార‌ణ స్థితికి!

Flight Outage | అమెరికాలో విమాన సేవ‌లు (Flight Outage) ఇప్ప‌టికీ సాధార‌ణ స్థితికి చేరుకోలేదు. దీంతో విమానా ప్ర‌యాణ అంత‌రాయాలు ఆదివారం కూడా కొన‌సాగే అవ‌కాశం ఉంది.

G

International | Published On Nov 15, 2026, 7.17 am IST

Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవ‌లు.. సాయంత్రానికి సాధార‌ణ స్థితికి!
Advertisement

Flight Outage | త్రినేత్ర న్యూస్‌: అమెరికాలో విమాన సేవ‌లు (Flight Outage) ఇప్ప‌టికీ సాధార‌ణ స్థితికి చేరుకోలేదు. దీంతో విమానా ప్ర‌యాణ అంత‌రాయాలు ఆదివారం కూడా కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో (ATC) త‌లెత్తిన‌ కమ్యూనికేషన్ లోపం దేశ‌వ్యాప్తంగా విమాన ప్ర‌యాణాల‌ను అస్త‌వ్య‌స్తం చేసిన విష‌యం తెలిసిందే. దానిని సాధారణ స్థితికి తీసుకురావ‌డానికి విమాన‌యాన సంస్థ‌లు తంటాలు పడుతుండటంతో వేలాది విమానాలు రద్దయ్యాయి లేదా ఆలస్యమయ్యాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు, సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నప్పటికీ, ఆదివారం సాయంత్రం వరకు విమానాల షెడ్యూల్‌లు సాధారణ స్థితికి రావడం కష్టమని ఎఫ్ఏఏ చీఫ్ బ్రియాన్ బెడ్‌ఫోర్డ్ (Bryan Bedford) తెలిపారు.

విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్ 'ఫ్లైట్ అవేర్' (FlightAware) ప్రకారం.. శనివారం సాయంత్రం నాటికి అమెరికా వ్యాప్తంగా 6,150కి పైగా విమానాలు రద్దుకాగా, మ‌రో 7,300లకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. శుక్రవారం దాదాపు 9,200 విమానాలు రద్దవ్వగా, 7,500 విమానాలు ఆలస్యమయ్యాయి. ఆదివారం షెడ్యూల్ చేసిన 530కి పైగా విమానాలు కూడా రద్దయ్యాయి. ఈ అంతరాయం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి బెడ్‌ఫోర్డ్ క్షమాపణలు చెప్పారు. విమానయాన వ్యవస్థ స్థిరంగా ఉందని, ఆదివారం సాయంత్రం నాటికి కార్యకలాపాలు సాధార‌ణ స్థితికి చేరుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు. విమాన సేవ‌లు నిలిచిపోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఇంత సుదీర్ఘంగా విమానాలను నిలిపివేయడం ఇదే తొలిసారి.

అమెరికాలో విమాన ప్రయాణాలకు ఏర్పడిన ఈ అంతరాయానికి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రధాన కారణమని అమెరికా రవాణా శాఖ తెలిపింది. FAA కాంట్రాక్టర్ అయిన L3Harris టెక్నాలజీస్ సంస్థ, 1980ల నాటి పాత రాగి (Copper) వైర్ల స్థానంలో కొత్త ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను అమర్చే పనిని శుక్రవారం మధ్యాహ్నం చేపట్టింది. ఆ సమయంలో కీలక డేటాను చేరవేసే స్విచ్‌లు, రౌటర్లపై ఒక్కసారిగా భారం పడటంతో (Overload) డేటాలో అస్థిరత ఏర్పడింద‌ని వెల్ల‌డించింది. ఈ సాంకేతిక లోపం వల్ల దేశంలోని 22 ప్రాంతీయ ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లలో 17 కేంద్రాలపై ప్రభావం పడింద‌ని తెలిపింది. దీంతో పైలట్లు, కంట్రోలర్ల మధ్య వాయిస్ కమ్యూనికేషన్, రాడార్ సంకేతాల్లో అంతరాయం ఏర్పడటంతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాలను నిలిపివేయాల్సి వచ్చింద‌ని పేర్కొంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

అమెరికా విమానాలకు సడెన్ బ్రేక్: రోజుకు 44,000 ఫ్లైట్స్, గాల్లో 5,500.. అసలు యూఎస్ గగనతలం ఎలా పనిచేస్తుందంటే?

అరుణాచ‌ల క్షేత్రానికి కార్తీక శోభ‌.. నేటి నుంచి బ్ర‌హ్మోత్స‌వాలు

ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

ప్రేమ పేరుతో గ‌ర్భవ‌తిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం త‌క్కువ అన్నాడు..

Advertisement
Advertisement