త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sam Pitroda | ప్ర‌ధాని ఫోన్ల‌ను ట్యాప్ చేయ‌రు.. రాహుల్ ఆరోప‌ణ‌లను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా

Sam Pitroda | రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల‌ను కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా (Sam Pitroda) తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లను ట్యాప్ చేసే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు. ప్ర‌ధాని అలా చేస్తార‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు.

D

National | Published On Nov 14, 2026, 1.45 pm IST

Sam Pitroda | ప్ర‌ధాని ఫోన్ల‌ను ట్యాప్ చేయ‌రు.. రాహుల్ ఆరోప‌ణ‌లను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా
Advertisement

Sam Pitroda | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (Pm Modi) త‌న ఫోన్‌ను ట్యాప్ (Phone Tapping) చేస్తున్నారంటూ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా (Sam Pitroda) భిన్నంగా స్పందించారు. రాహుల్ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లను ట్యాప్ చేసే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు. ప్ర‌ధాని అలా చేస్తార‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు.

"ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాని మోదీకి నేరుగా ప్రమేయం ఉందని నేను నమ్మడం లేదు. ఆయ‌న అలా చేస్తార‌ని కూడా అనుకోవ‌డం లేదు. ప్రధాని స్వయంగా ఎవరి దగ్గరికో వెళ్లి స్క్రూడ్రైవర్ పట్టుకుని కంప్యూటర్‌పై కూర్చుని ఇలాంటి పనులు చేయరు" అని పిట్రోడా స్ప‌ష్టం చేశారు. అదేస‌మ‌యంలో ప్రధానిని సమర్థిస్తూనే త‌న ఫోన్ కూడా ట్యాప్ అవుతోంద‌ని చెప్పారు. త‌న ల్యాప్‌టాప్‌పై కూడా దాడి జ‌రిగింద‌ని ఆరోపించారు. బ్యాంకు ఖాతాల‌పై కూడా నిఘా ఉంద‌ని తెలిపారు. ఈ విషయంపై సైబర్ నిపుణులను సంప్రదించగా.. ట్యాపింగ్ గురించి వారు తనను హెచ్చరించారని చెప్పుకొచ్చారు. ఈ ట్యాపింగ్ వ్య‌వ‌హారం వెనుక ఎవరున్నార‌న్న‌ది తనకు తెలియదని స్ప‌ష్టం చేశారు. దీనిపై పెద్దగా ఆందోళన చెందడం లేదని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీని నేరుగా నిందించలేమని పిట్రోడా వ్యాఖ్యానించారు.

మోదీ నేనూ ఫ్రెండ్స్‌..

ఇటీవలే ప్రధాని మోదీతో దీపావళి శుభాకాంక్షలు పంచుకోవడంపై వస్తున్న విమర్శలపై కూడా పిట్రోడా స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తనకు కేవలం రాజకీయపరమైన భేదాభిప్రాయాలే తప్ప, ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోదీ పట్ల తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని చెప్పారు. పార్టీలు వేరైనా మోదీ, తాను మంచి మిత్రులమని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత సంబంధాలకు రాజకీయాలతో ముడిపెట్టకూడదని వ్యాఖ్యానించారు.

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు..

కేంద్ర ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారంటూ రాహుల్ గాంధీ శుక్రవారం తీవ్ర ఆరోపణలు చేసిన విష‌యం తెలిసిందే. ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలు అందులోనే ఉన్నాయ‌ని రాహుల్ చెప్పారు. త‌న ఫోన్‌లో ఆధారాలు ఉన్న విష‌యం ప్ర‌ధానికి కూడా తెలుసున‌ని, అందుకే చ‌ర్చ‌కు రావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. మీ ఎనీథింగ్ సెష‌న్‌లో ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎప్పుడైనా, ఎక్క‌డైనా ప్ర‌ధానితో బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని రాహుల్ మ‌రోసారి స‌వాల్ విసిరారు (challenge for a one-on-one debate). తనతో ప్రత్యక్ష చర్చలో పాల్గొంటే ప్రధాని ఆ పదవిలో కొనసాగలేరని వ్యాఖ్యానించారు. ఆ చర్చ జరిగితే ఎవరు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారో, ఎవరు దేశ వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుస్తుందని స్ప‌ష్టం చేశారు. "మోదీ విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారు. నా ఫోన్‌లో అన్ని ఆధారాలున్నాయి. నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు. ఈ విష‌యం ప్ర‌ధానికి కూడా తెలుసు అందుకే చ‌ర్చ‌కు రావ‌డం లేదు. ముఖాముఖి చ‌ర్చ‌కు వ‌స్తే ఎవ‌రు దేశ వ్య‌తిరేకులో బ‌య‌ట‌ప‌డుతుంది" అని రాహుల్ స‌వాల్ విసిరారు.

Also Read..

రామ్‌లీలాలో నిర‌స‌న‌ల‌కు ఢిల్లీ పోలీసులు కొత్త రూల్స్‌.. 50,000 మందికి మాత్ర‌మే అనుమ‌తి

హ‌సీనా స్వ‌దేశానికి వెళ్లేందుకు భార‌త్ ఓకే.. బంగ్లా ప్ర‌భుత్వానికి కొన్ని ష‌ర‌తులు

గిగ్ వ‌ర్క‌ర్ల ర్యాలీ.. మ‌హిళా స్కూటీపై రాహుల్ ప్ర‌యాణం

Advertisement
Advertisement