త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abki Baar AQI 400-Paar | ‘అబ్ కీ బార్, ఏక్యూఐ 400-పార్’.. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు

Abki Baar AQI 400-Paar | 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇచ్చిన "అబ్ కీ బార్ 400-పార్" నినాదం ఢిల్లీ వాయుకాలుష్యం (Delhi Air Pollution) విష‌యంలో నిజ‌మైంద‌ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఈసారి ఏక్యూఐ 400 దాటిందని ఎక్స్‌లో పోస్టు చేశారు.

D

National | Published On Nov 14, 2026, 4.37 pm IST

Abki Baar AQI 400-Paar | ‘అబ్ కీ బార్, ఏక్యూఐ 400-పార్’.. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
Advertisement

Abki Baar AQI 400-Paar | త్రినేత్ర న్యూస్ : దేశ‌ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ క్షీణిస్తున్న వాయు కాలుష్యం (Delhi Air Pollution)పై కాంగ్రెస్ పార్టీ (Congress) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) గతంలో ఇచ్చిన ఎన్నిక‌ల నినాదం "అబ్ కీ బార్ 400-పార్‌"న్ని ప్ర‌స్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మోదీ నినాదం ఢిల్లీ కాలుష్యం విష‌యంలో విజ‌య‌వంత‌మైంద‌ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

""అబ్ కీ బార్, ఏక్యూఐ 400-పార్ (ఈసారి ఏక్యూఐ 400 దాటింది). ప్రవచనమంత్రి (మోదీని ఉద్దేశిస్తూ) ఇచ్చిన నినాదం ఇప్పుడు AQI విషయంలో నిజమైంది..! 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ "అబ్ కీ బార్ 400-పార్" అనే నినాదాన్ని గాల్లోకి విసిరారు. ఇప్పుడు అదే గాలి విషపూరితంగా మారింది" అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప్ర‌పంచంలోనే అత్యంత క‌లుషిత‌మైన న‌గ‌రంగా మారిపోయింద‌ని జైరామ్ ర‌మేష్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

శ్వాస తీసుకోవ‌డం కూడా క‌ష్టంగా మారింద‌ని చెప్పారు. దీనివల్ల పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్నారు. శ్వాసకోశ ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయ‌ని.. ఫలితంగా ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాగా, 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో 400లకు పైగా లోక్‌సభ స్థానాలతో ఎన్డీఏ ప్ర‌భుత్వాన్ని గెలిపించాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు "అబ్ కీ బార్ 400-పార్" అనే నినాదంతో ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు.

Also Read..

టెక్స్‌టైల్ గోడౌన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఎగ‌సిప‌డుతున్న మంట‌లు

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 14 ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ..!

క‌విత గారు! విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ మీ చేతికెట్లొచ్చింది?

Advertisement
Advertisement