GTA 6 | భారత్ ఇప్పుడు సరికొత్త గేమ్ ఆడుతోంది.. జీటీఏ 6 లాంఛ్ వేళ ప్రధాని ఆసక్తికర పోస్ట్
GTA 6 | ప్రముఖ వీడియో గేమ్ గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 (GTA 6) విడుదలైన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi)తన ఇన్‌స్టా ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. 2013లో 'జీటీఏ 5' విడుదలైనప్పటి నుంచి 2026లో 'జీటీఏ 6' విడుదలయ్యే వరకు గడిచిన 13 ఏళ్లలో భారత్ సాధించిన ప్రగతిని వివరిస్తూ.. 'భారత్ ఇప్పుడు సరికొత్త గేమ్ ఆడుతోంది' (India is playing a whole new game) అంటూ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.
GTA 6 | త్రినేత్ర న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. యువతను ఆకర్షించేందుకు వారితో నేరుగా సంభాషించేందుకు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి సోషల్ మీడియా వేదికలపై రీల్స్, ఇంటరాక్టివ్ వీడియోలను పోస్టు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ వీడియో గేమ్ గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 (GTA 6) విడుదలైన సందర్భంగా ప్రధాని తన ఇన్‌స్టా ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. 2013లో 'జీటీఏ 5' విడుదలైనప్పటి నుంచి 2026లో 'జీటీఏ 6' విడుదలయ్యే వరకు గడిచిన 13 ఏళ్లలో భారత్ సాధించిన ప్రగతిని వివరిస్తూ.. 'భారత్ ఇప్పుడు సరికొత్త గేమ్ ఆడుతోంది' (India is playing a whole new game) అంటూ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.
గత దశాబ్దకాలంలో పేదరికంలో గణనీయమైన తగ్గుదల సహా దేశం అధిగమించిన మైలురాళ్లను ఈ పోస్ట్‌లో వివరిస్తూ.. జీటీఏ గేమ్‌లకు గుర్తింపుగా నిలిచే ప్రత్యేకమైన 'ప్రైస్‌డౌన్' (Pricedown) ఫాంట్‌ను ఉపయోగించి రూపొందించిన గ్రాఫిక్ కార్డులను షేర్ చేశారు. 2013లో మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు భారత్, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, టర్కీలను విదేశీ పెట్టుబడులపై అతిగా ఆధారపడే బలహీన ఆర్థిక వ్యవస్థలుగా ('ఫ్రజైల్ 5' - Fragile 5) అభివర్ణించారని గుర్తు చేశారు. అయితే, నేడు భారత్ ఆ జాబితా నుంచి బయటపడి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.
అంతేకాదు, దశాబ్దకాలంలో భారత్ పేదరికంలో గణనీయమైన దగ్గుదలను నమోదు చేసిందని చెప్పారు. దేశంలో తీవ్ర పేదరికం 27 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిందని గణాంకాలతో సహా వివరించారు. సౌర విద్యుత్ సామర్థ్యం 2.82 గిగావాట్ల నుంచి 175 గిగావాట్లకు పెరిగిందని, అలాగే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌ల సంఖ్య 440కి చేరిందని వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ పూర్తి, విద్యుదీకరణ మెరుగుపడటం వంటి దేశం సాధించిన విజయాలను ఇందులో వివరించారు.
View this post on Instagram
ముఖ్యంగా గేమింగ్ కమ్యూనిటీని ఆకట్టుకునేలా ఇంటర్నెట్ ధరల తగ్గుదలను కూడా ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో ఒక జీబీ (GB) హై-స్పీడ్ ఇంటర్నెట్ ధర రూ. 308 ఉండగా, నేడు అది రూ.7.51కి దిగివచ్చిందని తెలిపారు. దేశం నక్సలిజం రహితంగా మారడంతో పాటు, ప్రముఖ రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదిగిందని ప్రధాని తన పోస్టులో హైలైట్ చేశారు. ప్రధాని ఈ పోస్టు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ పోస్టు పలువురు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు ప్రధాని మోదీని తమ "ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్", "ఓజీ క్రియేటర్" (OG creator) అంటూ అభివర్ణించారు. "ఎప్పటికీ కూలెస్ట్ ప్రైమ్ మినిస్టర్" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
2013 సెప్టెంబర్ 17న 'గ్రాండ్ తెఫ్ట్ ఆటో 5' (GTA 5) విడుదలై గేమింగ్ ప్రపంచంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. రాక్‌స్టార్ గేమ్స్ (Rockstar Games) రూపొందించిన ఈ గేమ్ మొదట ప్లేస్టేషన్ 3 (PS3), ఎక్స్‌బాక్స్ 360 (Xbox 360) కన్సోల్‌ల కోసం అందుబాటులోకి వచ్చింది. 2014లో PS4, Xbox One కోసం, 2015లో PC కోసం, ఆ తర్వాత 2022లో PS5, Xbox Series X/S కోసం అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్లు విడుదలయ్యాయి. జీటీఏ 5 విడుదలైన 13 ఏళ్ల సుదీర్ఝ నిరీక్షణ తర్వాత 'జీటీఏ 6' విడుదలైంది. ఈ గేమ్ తయారీకి సుమారు 1 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చైనట్లు అంచనా. విడుదల కాకముందే ప్రీ-ఆర్డర్ల ద్వారానే ఈ గేమ్ దాదాపు 1.1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి, చరిత్రలోనే అతిపెద్ద ప్రీ-ఆర్డర్ లాంచ్‌గా రికార్డు సృష్టించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Also Read..
పెట్టుబడిదారులకు అలర్ట్.. మళ్లీ భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి
బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్: హాల్‌మార్క్ మిషన్లను సైతం ఏమార్చేస్తున్న 'చైనా పౌడర్'
సంబంధిత వార్తలు

Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
నవంబర్ 21, 2026

GTA 6 | చరిత్ర సృష్టించిన జీటీఏ6.. తొలి రోజే 3.8 బిలియన్ డాలర్ల అమ్మకాలు..
నవంబర్ 21, 2026

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు



