Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. మళ్లీ భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో అమెరికా డాలర్ బలపడింది. దీంతో బులియన్ మార్కెట్లపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో అమెరికా డాలర్ బలపడింది. దీంతో బులియన్ మార్కెట్లపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఈ వారం ఆయా లోహాల ధరలు పాజిటివ్‌గా ప్రారంభం అయినప్పటికీ అమ్మకాల ఒత్తిడి కారణంగా వరుస సెషన్లలో ధరలు క్షీణిస్తున్నాయి. గురువారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 0.32 శాతం స్వల్పంగా పెరిగి 3,736 డాలర్లకు చేరగా, వెండి ధర 0.84 శాతం పెరిగి 45 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 183 పాయింట్లు తగ్గి 1,29,631కి చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 833 పాయింట్లు పెరిగి 1,61,582 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో ఒక్క రోజులోనే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధర రూ.25వేలకు పైగా పతనమవ్వగా, వెండి ధర మళ్లీ రూ.5వేలు తగ్గింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,069 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,04,552 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,30,690 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.13,06,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.25,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,980 ఉండగా, 8 గ్రాముల ధర రూ.95,840గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,19,800 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,98,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.23,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,802 ఉండగా, 8 గ్రాముల ధర రూ.78,416గా ఉంది. 10 గ్రాముల ధర రూ.98,020 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.9,80,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.19,200 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.1,80,000 ఉండగా, తులం ధర రూ.1,800గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.1,80,000 ఉండగా, తులం ధర రూ.1,800 గా ఉంది.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు






