Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
Elderly couple death | జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ (Station Ghanpur)లో విషాదం చోటుచేసుకుంది. భర్త తనకు శాశ్వతంగా దూరం కావడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.
Elderly couple death | త్రినేత్ర న్యూస్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ (Station Ghanpur)లో విషాదం చోటుచేసుకుంది. భర్త తనకు శాశ్వతంగా దూరం కావడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురై గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ హృదయవిదారక ఘటనతో చాగల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని చాగల్లుకు చెందిన వడ్లకొండ లోకనాథం (84), వడ్లకొండ రామక్క (75) దంపతులు. శుక్రవారం రాత్రి సుమారు 9:50 గంటల ప్రాంతంలో లోకనాథం వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. ఇది దిగమింగుకోలేని రామక్క తీవ్ర మనోవేదనకు గురైంది. గుండెలవిసేలా రోదించింది. భర్త మృతిని తట్టుకోలేని ఆమె శనివారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటల ప్రాంతంలో ప్రాణాలు విడిచింది.
రామక్క కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడిందని.. ఇది చూసి లోకనాథం ఎంతో మనోవేదనకు గురయ్యే వారిని స్థానికులు తెలిపారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదని భావోద్వేగానికి గురయ్యారు. కాగా వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
చీటికి మాటికే గొడవలు, విడిపోవడం జరుగుతున్న నేటి కాలం యువతకు ఈ వృద్ధ దంపతుల ప్రేమ స్ఫూర్తి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దాంపత్య జీవనం ఎంత గొప్పదో, ఆ బంధానికి ఉన్న ఎమోషన్ ఎంత విలువైనదో జెన్-జీ తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్
- ●Loan Guarantor | లోన్ గ్యారంటర్‌గా సంతకం చేస్తున్నారా? ఈ ప్రమాదాలు తెలుసుకోండి!

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు




