త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

car falls into canal | కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి

car falls into canal | బీహార్‌లో (Bihar) అతి వేగంగా ప్ర‌యాణిస్తున్న ఓ స్కార్పియో వాహ‌నం అదుపుతప్పి వంతెనపై (Bridge) నుంచి కాలువ‌లోకి దూసుకెళ్లింది (car falls into canal). ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Nov 19, 2026, 11.44 am IST

car falls into canal | కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి
Advertisement

car falls into canal | త్రినేత్ర న్యూస్ : బీహార్‌లో (Bihar) ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. అరారియా (Araria) జిల్లాలో అతి వేగంగా ప్ర‌యాణిస్తున్న ఓ స్కార్పియో వాహ‌నం అదుపుతప్పి వంతెనపై (Bridge) నుంచి కాలువ‌లోకి దూసుకెళ్లింది (car falls into canal). ఈ దుర్ఘ‌ట‌న‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒక‌రు గాయ‌ప‌డ్డారు.

తారాబరి పోలీస్ స్టేషన్ పరిధిలో (Tarabari Police Station limits)ని బీడీ వంతెన (Bidi bridge) వద్ద బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సుపౌల్ జిల్లా పిప్రా ప్రాంతంలోని థుమ్హా గ్రామానికి చెందిన ఏడుగురు స్కార్పియోలో సిక్టీ ప్రాంతంలోని భప్టియా గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వేడుక ముగించుకొని తిరిగి వ‌స్తుండ‌గా.. డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపుత‌ప్పి కాలువలోకి పడిపోయింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. కారులో ఉన్న ఏడుగురిని బ‌య‌ట‌కు తీసి అరారియా సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్ప‌టికే ఆరుగురు మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. గాయ‌ప‌డిన వ్య‌క్తి ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

కాలిపోతున్న కారులో.. భార‌తీయుడి మృతదేహం ల‌భ్యం

దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుంది : నాగరాజు గుర్రాల

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. ఇప్ప‌ట్లో లేన‌ట్లే..?

Advertisement
Advertisement