Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్
Indus Water | సింధూ జలాల ఒప్పందం (IWT) విషయంలో భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. షాంఘై సహకార సంస్థ (SCO) తొలి సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్‌లో (Civilisational Dialogue Forum) పాల్గొనేందుకు పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ న్యూఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
Indus Water | త్రినేత్ర న్యూస్ : సింధూ జలాల ఒప్పందం (IWT)పై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఒప్పందం విషయంలో భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఢిల్లీలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) తొలి సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్‌లో (Civilisational Dialogue Forum) పాల్గొనేందుకు పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ (Pakistan Minister Musadik Malik) న్యూఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై స్పందించారు. "సింధూ జలాల ఒప్పందానికి సంబంధించి మా వైఖరిని ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాము. మేము ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాము. అందులో ఎలాంటి మార్పు లేదు" అని స్పష్టం చేశారు.
గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. పాకిస్థాన్ ప్రోత్సహిత సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించే వరకు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ ఉండదని భారత్ స్పష్టం చేసింది.
ఇక గతేడాది ఇరు దేశాల మధ్య జరిగిన తర్వాత పాక్ మంత్రిని భారత్ ఆహ్వానించడం ఇదే తొలిసారి. గతంలో 2023 మే నెలలో గోవాలో జరిగిన SCO విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్థాన్ చివరిసారిగా హాజరైంది. ఇక ఈ సదస్సుకు ఎస్‌సీఓలో ఉన్న 10 సభ్య దేశాలనూ ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Also Read..
స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే
భారత్‌లోనే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్.. ఫెడ్‌పై ట్రంప్ విమర్శలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shehbaz Sharif | భారత్‌పై పాక్ గెలుపు.. ప్రధాని షరీఫ్‌పై నెట్టింట ట్రోల్స్
అక్టోబర్ 31, 2026

India invites Pakistan | భారత్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి అధికారిక పిలుపు
అక్టోబర్ 28, 2026

UNGA | పగలు ప్రపంచ శాంతి, రాత్రి ఉగ్రవాదం.. ఇదీ దాయాది కపట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు సమాధానం
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Loan Guarantor | లోన్ గ్యారంటర్‌గా సంతకం చేస్తున్నారా? ఈ ప్రమాదాలు తెలుసుకోండి!
- ●BRS Leaders | కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- ●Special Trains | ప్రయాణికులకు అలర్ట్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
- ●WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..
- ●E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!
- ●MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే

Loan Guarantor | లోన్ గ్యారంటర్‌గా సంతకం చేస్తున్నారా? ఈ ప్రమాదాలు తెలుసుకోండి!

BRS Leaders | కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

Special Trains | ప్రయాణికులకు అలర్ట్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..



