త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TN Assembly | ప్రేమలత విజయకాంత్‌పై పన్నీర్ సెల్వం ఫన్నీ పంచ్.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన స‌భ్యులు

TN Assembly | త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. డీఎండీకే అధినేత్రి ప్రేమ‌ల‌త విజ‌య‌కాంత్ (DMDK leader Premalatha Vijayakanth), మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం (O Panneerselvam) మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ స‌భ‌లో న‌వ్వులు పూయించింది.

D

National | Published On Jun 22, 2026, 5.06 pm IST

TN Assembly | ప్రేమలత విజయకాంత్‌పై పన్నీర్ సెల్వం ఫన్నీ పంచ్.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన స‌భ్యులు
Advertisement

TN Assembly | నిత్యం విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో ద‌ద్ద‌రిల్లే త‌మిళ‌నాడు అసెంబ్లీ (TN Assembly) ఇవాళ ఆస‌క్తిక‌రంగా సాగింది. స‌భ్యుల మ‌ధ్య స‌ర‌దా స‌న్నివేశం చోటు చేసుకుంది. తాగునీటి విష‌యంలో జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర సంభాష‌ణ స‌భ‌లో న‌వ్వులు పూయించింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. జూన్ 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డీఎండీకే అధినేత్రి ప్రేమ‌ల‌త విజ‌య‌కాంత్ (DMDK leader Premalatha Vijayakanth) మాట్లాడుతూ.. తొలుత సీఎం విజ‌య్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర్వాత అసెంబ్లీలో సిబ్బంది ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద‌కూ వ‌చ్చి తాగునీటిని ఇచ్చే సాంప్ర‌దాయాన్ని మార్చాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. స‌భ‌లో ఎమ్మెల్యేల‌కు సిబ్బంది స్వ‌యంగా వ‌చ్చి నీళ్లు అందించే ప‌ద్ధ‌తికి స్వ‌స్తి ప‌లికి బ‌ల్ల‌ల‌పైనే తాగునీటి సీసాల‌ను ఉంచాల‌ని సూచించారు. అయితే, ప్లాస్టిక్ బాటిల్స్‌, గ్లాసుల‌కు బ‌దులు గాజు సీసాల‌ను ఉంచాల‌ని స్పీక‌ర్‌ను డిమాండ్ చేశారు.

ప్రేమ‌ల‌త డిమాండ్‌పై అక్క‌డే ఉన్న‌ మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం (O Panneerselvam) ఆస‌క్తిక‌రంగా స్పందించారు. అమ్మా.. ఇది మంచి ఆలోచ‌నే, అయితే ఎమ్మెల్యేల ముందు వాట‌ల్ బాటిల్స్ ఉంచ‌డం అంత మంచిది కాదు అని అభిప్రాయ‌ప‌డ్డారు. స‌భ‌లో తీవ్ర‌మైన చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్పుడు కోపంలో వాటిని ప్ర‌త్య‌ర్థుల‌పై విసిరే ప్ర‌మాదం ఉందంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. సెల్వం వ్యాఖ్య‌ల‌తో స‌భ‌లో ఒక్క‌సారిగా న‌వ్వులు పూశాయి. ముఖ్య‌మంత్రి విజ‌య్, ప్ర‌తిప‌క్ష‌నేత ఉద‌య‌నిధి స్టాలిన్, స్పీక‌ర్ స‌హా స‌భ‌లోని వారంతా ఒక్క‌సారిగా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఇక దీనిపై ప్రేమ‌ల‌త కూడా త‌న‌దైనశైలిలో స‌మాధానమిచ్చారు. గొడ‌వ చేయాల‌నుకుంటే వాట‌ర్ బాటిళ్లే కాదు ఏదైనా విసురుతారంటూ ప‌న్నీర్ సెల్వంకు కౌంట‌ర్ ఇచ్చారు.

Also Read..

ఎత్తు పొడవులతో ప్రజలకు ఉపయోగం ఉండదు రేవంత్‌.. హ‌రీశ్ కౌంట‌ర్

3 ఏళ్ల కాలానికి ఎఫ్‌డీల‌కు అత్య‌ధిక వ‌డ్డీ రేట్ల‌ను ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

లక్నో కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో పైనుంచి దూకేసిన స్టూడెంట్స్

Advertisement
Advertisement