FD Interest Rates | 3 ఏళ్ల కాలానికి ఎఫ్‌డీలకు అత్యధిక వడ్డీ రేట్లను ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
FD Interest Rates | ఇప్పటికీ చాలా మంది పెట్టుబడిదారులు బ్యాంక్ ఎఫ్‌డీలనే (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తారు. ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడితే మూలధనం భద్రంగా ఉండటంతోపాటు ముందుగానే ఎంత రాబడి వస్తుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. అందుకే ఎఫ్‌డీలకు ఇప్పటికీ ఆదరణ కొనసాగుతోంది.
FD Interest Rates | ఇప్పటికీ చాలా మంది పెట్టుబడిదారులు బ్యాంక్ ఎఫ్‌డీలనే (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తారు. ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడితే మూలధనం భద్రంగా ఉండటంతోపాటు ముందుగానే ఎంత రాబడి వస్తుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. అందుకే ఎఫ్‌డీలకు ఇప్పటికీ ఆదరణ కొనసాగుతోంది. దేశంలోని వివిధ బ్యాంకులు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు భిన్న కాలపరిమితులతో ఎఫ్‌డీలను అందిస్తున్నాయి. ప్రతి బ్యాంకు వడ్డీ రేట్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూసి, ఎక్కువ రాబడి ఇచ్చే బ్యాంకును ఎంచుకోవడం మంచిది. జూన్ నాటికి దేశంలోని పలు ప్రభుత్వ రంగ, ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తున్న 3 ఏళ్ల ఎఫ్‌డీ వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 3 ఏళ్ల కాలానికి గాను ఎఫ్‌డీలకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 6.25 శాతం, కెనరా బ్యాంక్ 6.25 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) 6.35 శాతం, ఎస్‌బీఐ 6.30 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.10 శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 6.70 శాతం వడ్డీ రేటుతో ముందంజలో ఉంది. ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6.45 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 6.45 శాతం, యాక్సిస్ బ్యాంక్ 6.45 శాతం వడ్డీ అందిస్తున్నాయి. యెస్ బ్యాంక్ 7 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7 శాతం వడ్డీ ఇస్తుండగా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.35 శాతం వడ్డీతో ఈ విభాగంలో అత్యధిక రాబడిని అందిస్తోంది.
స్మాల్ ఫైనాన్స్ విభాగంలో..
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఎఫ్‌డీలలో వడ్డీ రేట్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25 శాతం, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.50 శాతం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.40 శాతం, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.50 శాతం, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.10 శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈ విభాగంలో జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా 7.50 శాతం వడ్డీతో అగ్రస్థానంలో నిలిచాయి. అయితే 3 ఏళ్ల ఎఫ్‌డీలలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. కానీ పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ రేట్లతోపాటు బ్యాంకు విశ్వసనీయత, డిపాజిట్ భద్రత, లిక్విడిటీ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని సలహాలకు నిపుణులను సంప్రదించవచ్చు.
సంబంధిత వార్తలు

RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..
ఆగస్టు 1, 2026

ITR | ఎఫ్‌డీల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలా.. ఐటీఆర్‌లో ఎలా నమోదు చేయాలి..?
జులై 20, 2026

RBI | క్లెయిమ్ చేయని నగదును బ్యాంకుల నుంచి ఎప్పుడైనా పొందవచ్చు.. స్పష్టత ఇచ్చిన ఆర్బీఐ..
జులై 2, 2026
తాజావార్తలు
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..
- ●BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు
- ●MLA Mallareddy | మంత్రి పొంగులేటి పాలు పొంగినట్టు పొంగుతున్నాడు : ఎమ్మెల్యే మల్లారెడ్డి

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?

Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..



