Harish Rao | ఎత్తు పొడవులతో ప్రజలకు ఉపయోగం ఉండదు రేవంత్.. హరీశ్ కౌంటర్
Harish Rao | ఎత్తు పొడవులతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు.. మంచి పరిపాలన అవసరం ఉంటుందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులకు రూ.29,350 కోట్ల భరోసా ఎగ్గొట్టి, బోనస్‌ను బోగస్ చేసి,కేంద్రం చెబితేనే పంటలు కొంటాం అంటున్న రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. పక్కా మోసగాడు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఎత్తు పొడవులతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు.. మంచి పరిపాలన అవసరం ఉంటుందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులకు రూ.29,350 కోట్ల భరోసా ఎగ్గొట్టి, బోనస్‌ను బోగస్ చేసి,కేంద్రం చెబితేనే పంటలు కొంటాం అంటున్న రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. పక్కా మోసగాడు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, మోసగాడు. నల్లమల పేరు చెప్పి నల్లమల గౌరవం రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడు. ఇప్పటివరకు రూ. 29,350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీపడ్డాడు. ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయింది. మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌ను మొలకెత్తనియ్య అని అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు, సోయాబీన్, పల్లి, సన్‌ప్లవర్ కొంతమేరే కొంటుంది. కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుంది. ఖరీఫ్ సీజన్‌లో వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు అని హరీశ్‌రావు అన్నారు.
రేవంత్ రెడ్డి మోసాలను ఎండగడుతూనే ఉండాలి..
ఉమ్మడి పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం. దళారుల, మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ , ఆయన ఎవరి తోలు తియ్యలే. రాష్ట్రం సాధించిన పార్టీగా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. తెలంగాణ కోసం రాజీనామాలో చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్ రెడ్డి, పాలకపక్షం అవుతుందని ఒప్పుకున్నాడు. 100 స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని, ఆయన మోసాలను ఎండగడుతూనే ఉండాలి. పేరుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లు.. ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. బీఆర్ఎస్ హయంలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేశారు. లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే పైసలు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడని మాజీ మంత్రి పేర్కొన్నారు.
గెస్ట్ హౌస్ చుట్టూ రూ. 17 కోట్లతో ఇనుప కంచెలు
రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో రూ. 100 కోట్లతో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. గెస్ట్ హౌస్ చుట్టూ రూ. 17 కోట్లతో ఇనుప కంచెలు వేసుకున్నాడు. రేవంత్ రెడ్డి మనవడితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు పైసలు ఉంటాయి. కేరళ, బీహార్, మహారాష్ట్ర , ఢిల్లీలో వందల కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి. పేద వర్గాల వారికి పైసలు ఇచ్చేందుకు డబ్బులు లేవని అంటున్నాడు. కేసీఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఒక తరమే దెబ్బతినే పరిస్థితి వచ్చింది అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
భూమి బద్దలైనా మల్లొచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే
భూమి బద్దలైనా మల్లొచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే. స్కాంల ప్రభుత్వం వద్దు స్కీమ్‌ల ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవడు అయితే కేసులు పెట్టిండో, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టం. రిటైర్ అయినా, ఎక్కడున్నా పట్టుకొని వచ్చి బొక్కలో వేస్తాం. పెట్రోల్, డీజిల్, ఎరువులు, ఆర్టీఏ ఛార్జీలు, మధ్యం ధరలు పెరిగాయి. ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లు రేవంత్ రెడ్డి ప్రజలపై పన్నులు వేస్తున్నాడు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఏళ్ల వరకు ప్రజలు తిట్టుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని మండిపడ్డారు.
అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరెయ్యాలి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర యేండ్లు అవుతుంది, ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులలాగా కేసీఆర్ మార్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 75 శాతం పూర్తి చేశాము. మిగిలిన పనులు పూర్తి చెయ్యకుండా రెండున్నర యేండ్లగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసి 3 లక్షల 30 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాము. ఈ ప్రభుత్వంలో ప్రాజెక్ట్‌లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఈ ప్రభుత్వంలో కృష్ణా నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి. ఈ ప్రభుత్వంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను మూరెడు తొవ్వలేదు. సిగాచీ ఫ్యాక్టరీలో 54 మంది చనిపోతే ఒక్క రూపాయి ఎక్స్‌గ్రేషియో ఇవ్వలేదు. కార్యకర్తలు గట్టిగా పనిచేసి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరెయ్యాలి. అప్పుడు కొడంగల్‌కు ఇంఛార్జ్‌గా ఉండి రేవంత్ రెడ్డిని ఓడించాము. ఈసారి ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలకు 14 బీఆర్ఎస్ గెలుస్తుందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
తాజావార్తలు
- ●Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్, డేట్ చెప్తే ఆధారాలతో వస్తం
- ●India UAE Defence Deal | ఇండియన్ వెపన్స్‌పై కన్నేసిన యూఏఈ: 'బ్రహ్మోస్', 'ఆకాశ్ తీర్' కోసం ముమ్మర చర్చలు
- ●Shiv Sena UBT Split | ఉద్ధవ్ సేనకు షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు రెబల్ ఎంపీలు
- ●Rashmika Mandanna | అప్పుడు జాన్వీ - ఇప్పుడు రష్మిక - సేమ్ సీన్ రిపీట్
- ●Aliganj Fire Accident 11 Dead | లక్నో కోచింగ్ సెంటర్ అగ్నిప్రమాదం ఘటనలో 11 మంది దుర్మరణం
- ●Ponguleti Srinivas Reddy | దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్‌లు ఇవ్వండి

Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్, డేట్ చెప్తే ఆధారాలతో వస్తం

India UAE Defence Deal | ఇండియన్ వెపన్స్‌పై కన్నేసిన యూఏఈ: 'బ్రహ్మోస్', 'ఆకాశ్ తీర్' కోసం ముమ్మర చర్చలు

Shiv Sena UBT Split | ఉద్ధవ్ సేనకు షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు రెబల్ ఎంపీలు

Rashmika Mandanna | అప్పుడు జాన్వీ - ఇప్పుడు రష్మిక - సేమ్ సీన్ రిపీట్






