Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Prakash Raj | తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ (CM Vijay) పాలనపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌పై తనకు పలు సందేహాలు ఉన్నాయని చెప్పారు.
Prakash Raj | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ (CM Vijay) పాలనపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుమారు 120 రోజులుగా అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వాన్ని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటే అవుతుందన్నారు. కొత్త ప్రభుత్వానికి ఏడాదైనా సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
తిరుచ్చిలో మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. ఎన్నికలకు ముందే విజయ్‌పై తనకు పలు సందేహాలు ఉన్నాయని చెప్పారు. “విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందే నేను వాటి గురించి మాట్లాడాను. కానీ వారు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 120 రోజులే అయింది. కాబట్టి మనం ఇప్పుడు ఓ నిర్ణయానికి రాలేం. కొత్త ప్రభుత్వానికి ఏడాదైనా సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే వారి పనితీరు గురించి మాట్లాడాలి. ఏడాది తర్వాత ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే అప్పుడు నేనే స్వయంగా ప్రశ్నిస్తాను” అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. అదే సమయంలో యూకే పర్యటనలో భాగంగా అక్కడ ప్రముఖ నటుడు అజిత్ (Ajith Kumar)ను సీఎం విజయ్ కలవడంపై కూడా ప్రకాశ్ రాజ్ స్పందించారు. అందులో ఎలాంటి తప్పూ లేదని అన్నారు. అయితే, యూకే పర్యటన వల్ల విజయ్ తాను ఆశించిన ఫలితాల్ని సాధించారా..? లేదా..? అనేది ముఖ్యమని వ్యాఖ్యానించారు.
Also Read..
విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
సంబంధిత వార్తలు

Annamalai | పెట్టుబడుల కోసం డెడ్ ఎకానమీ దేశానికి వెళ్లడమేంటి..? విజయ్ యూకే పర్యటనపై అన్నామలై విమర్శలు
సెప్టెంబర్ 21, 2026

Supreme Court | హిందీ విషయంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.. తమిళనాడు సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం
సెప్టెంబర్ 17, 2026

MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
- ●BSNL | కేవలం రూ.51కే 28 రోజుల ప్లాన్.. రోజూ 2జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్..
- ●High Court issues Notices | ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు
- ●Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్
- ●Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం

Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

BSNL | కేవలం రూ.51కే 28 రోజుల ప్లాన్.. రోజూ 2జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్..

High Court issues Notices | ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..



