Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
Cheetah | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతా (Project Cheetah) విజయవంతంగా నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం దేశంలో చీతాల సంఖ్య 52కు పెరిగింది. ఇందులో భారత్‌లో జన్మించిన చీతాలు 32 ఉన్నాయి.
Cheetah | త్రినేత్ర.న్యూస్ : భారతదేశంలో చీతాల పునరాగమనానికి నాలుగేళ్లు. దేశంలో 71 ఏండ్ల క్రితం అంతరించి పోయిన చీతాల (Cheetahs) పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ చీతా (Project Cheetah)లో భాగంగా ఆఫ్రికా నుంచి విడతల వారీగా చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. వాటిని మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో నేషనల్ పార్కు (Kuno National Park)లో ఉంచింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతమవుతోంది. విదేశీ చీతాలు ఇప్పుడు భారత గడ్డపై తమ సంతానోత్పత్తిని భారీగా పెంచుకుంటున్నాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం సరిగ్గా నాలుగేళ్ల క్రితం తొలిసారిగా నమీబియా నుంచి ఎనిమిది చీతాల్ని దేశంలోకి తీసుకొచ్చింది. అందులో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు వచ్చాయి. వీటన్నింటినీ మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పలు చిరుతలు మృతి చెందాయి. కొన్ని చీతాలు తమ సంతానోత్పత్తిని పెంచుకున్నాయి. ఇలా మొదట 8 చీతాలతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు ఆ సంఖ్య 52కు పెరిగింది. ఇందులో భారత్‌లో జన్మించిన చీతాలు 32 ఉన్నాయి. మొత్తం చీతాల్లో 49 చీతాలు మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో, మరో 3 చీతాలు అదే రాష్ట్రంలోని గాంధీ సాగర్ అభయారణ్యంలో ఉన్నాయి. వీటి కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు.
చీతాల్ని ఇండియా తీసుకొచ్చిన తొలి నాళ్లలోనే కొన్ని మరణించాయి. ఇండియాలో జన్మించిన కొన్ని చీతాలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. దీంతో ప్రాజెక్ట్ చీతాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుతం వాటి సంతానోత్పత్తి క్రమంగా పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం దేశంలో ఏడు దశాబ్దాల తర్వాత చీతాల కుటుంబం సందడి చేస్తోంది. చీతాల ఆవాసాలను కునో నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చీతాల ఆవాసాలను గాంధీసాగర్ ఇప్పటికే రెండో కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. తొలినాళ్లలో చీతాలను దేశానికి తీసుకురావడంపై దృష్టి పెట్టిన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం వాటి మనుగడ, సంతానోత్పత్తి, సహజసిద్ధంగా సంఖ్యను పెంచడంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది.
ఇదిలా ఉండగా.. దేశంలో చిరుత ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అంతేకాదు. వీటి ఆహారం కోసం భారీగా ఖర్చు అవుతున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. చీతాల ఆహారం కోసం రోజుకు రూ.35 వేలు ఖర్చవుతున్నట్లు తెలిపింది. 2024-25లో చీతాలకు ఆహారంగా వేసిన మేకల కోసం రూ.1,27,10,870 ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
Also Read..
ఢిల్లీలో మరో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి ఆరోతరగతి బాలికపై లైంగిక దాడి
గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Russia Sanctions Bill | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
సెప్టెంబర్ 19, 2026

KUNO | కునోలో 56కి చేరిన చిరుతల సంఖ్య.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన కేజీపీ12
సెప్టెంబర్ 18, 2026

UNSC | 9/11 సూత్రధారులు గుహల్లో దాక్కోలేదు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను మరోసారి ఎండగట్టిన భారత్
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..
- ●Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?
- ●Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట
- ●Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు
- ●Delhi | ఢిల్లీలో మరో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి ఆరోతరగతి బాలికపై లైంగిక దాడి
- ●Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్

Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..

Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?

Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట

Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు



