High Court issues Notices | ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు
High Court Notices | అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను దూషించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీలు తాతా మధు (Tata Madhu), నవీన్‌రెడ్డి (Naveen Reddy) కి తెలంగాణ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.
High Court issues Notices | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను దూషించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీలు తాతా మధు (Tata Madhu), నవీన్‌రెడ్డి (Naveen Reddy) కి తెలంగాణ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. వారిని అరెస్టు చేయొద్దని గతంలో నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా ఈమేరకు నోటీసులిచ్చింది.
నాంపల్లి కోర్టు రిమాండ్‌కు సైతం నిరాకరించడంతో పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. దీనిపై జరిగిన విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర రావు (PP Nageshwar Rao) తన వాదనలను బలంగా వినిపించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల అమర్యాదగా ప్రవర్తించారని కోర్టుకు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులపైనా వీరు దాడి చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
తాజావార్తలు
- ●Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్
- ●Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం
- ●Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
- ●Adah Sharma | పదకొండేళ్ల తర్వాత కన్నడ సినిమాలో అదాశర్మ - బిగ్‌బాస్ విన్నర్‌తో మైథాలజీ మూవీ
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..

Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్

Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం

Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి






