PM Modi | సోషల్ మీడియాలో ప్రధాని మోదీ మరో రికార్డు
PM Modi | సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరో రికార్డు సృష్టించారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube)లో ప్రధాని సబ్‌స్క్రైబర్ల (subscribers) సంఖ్య 30 మిలియన్‌లు దాటింది.
PM Modi | సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్ దాటిన విషయం తెలిసిందే. తాజాగా మరో రికార్డు సృష్టించారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube)లో ప్రధాని సబ్‌స్క్రైబర్ల (subscribers) సంఖ్య 30 మిలియన్‌లు దాటింది. తద్వారా యూట్యూబ్‌లో ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన నేతగా ప్రధాని రికార్డు సృష్టించారు.
ప్రధాని తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో రెండో స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీకి ఉన్న ఫాలోవర్లలో నాలుగో వంతు మాత్రమే బోల్సోనారోను ఫాలో అవుతున్నారు. ఇక ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే.. మన ప్రధానికి యూట్యూబ్‌లో ఏడు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం. ఇండియాలోనూ అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లు ప్రధాని మోదీకే ఉన్నారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే ప్రధానికే మూడు రెట్లు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఇన్‌స్టా ఫాలోవర్స్ @ 100 మిలియన్స్
మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో మోదీ ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్లకు (10 కోట్ల ఫాలోవర్స్) చేరిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వరల్డ్ లీడర్‌గా (PM Modi Becomes First World Leader), రాజకీయనేతగా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. మరోవైపు ఎక్స్‌లో ప్రధాని ఫాలోవర్స్ సంఖ్య ఇప్పటికే 100 మిలియన్లు దాటిన విషయం తెలిసిందే.
Also Read..
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






