త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait Of Hormuz | హ‌ర్ముజ్‌లోకి నౌక‌లు వ‌స్తే త‌గ‌ల‌బెడ‌తాం : ఇరాన్‌

Strait Of Hormuz | హ‌ర్ముజ్ జలసంధి (Strait Of Hormuz) మార్గాన్ని మూసివేసిన‌ట్లు ఇరాన్ (Iran) ప్ర‌క‌టించింది. ఈ జ‌ల‌సంధిని దాటి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తే ప‌డ‌వ‌ల‌కు నిప్పు పెడ‌తామ‌ని హెచ్చ‌రించింది.

D

International | Published On Mar 3, 2026, 9.54 am IST

Strait Of Hormuz | హ‌ర్ముజ్‌లోకి నౌక‌లు వ‌స్తే త‌గ‌ల‌బెడ‌తాం : ఇరాన్‌
Advertisement

Strait Of Hormuz | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు రోజురోజుకూ తీవ్ర‌త‌ర‌మ‌వుతున్నాయి. దాడులు, ప్ర‌తిదాడుల‌తో ప‌శ్చిమాసియా దేశాలు అట్టుడుకుతున్నాయి. ఈ యుద్ధం కార‌ణంగా చమురు ధరలు ఒక్క‌సారిగా భ‌గ్గుమంటున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఇరాన్ (Iran) చేసిన ప్ర‌క‌ట‌న మ‌రింత ఉద్రిక్త‌త‌లకు దారితీస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు హ‌ర్ముజ్ జలసంధి (Strait Of Hormuz) మార్గం ఆయువుపట్టుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వినియోగించే చమురులో దాదాపు 20 శాతం ఈ హ‌ర్ముజ్ జలసంధి గుండానే వెళుతుంది. అయితే, తాజా ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ జ‌ల‌సంధి గుండా చ‌మురు ర‌వాణాను నిలిపివేస్తున్న‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించింది.

త‌గ‌ల‌బెడ‌తాం..

అంతేకాదు, ఈ జ‌ల‌సంధిని దాటి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తే ప‌డ‌వ‌ల‌కు నిప్పు పెడ‌తామ‌ని హెచ్చ‌రించింది. "హ‌ర్ముజ్ జలసంధిని మూసివేశాం. ఎవరైనా దీనిని దాటడానికి ప్రయత్నిస్తే.. రివల్యూషనరీ గార్డ్స్ (Iranian Revolutionary Guards), నేవీ సిబ్బంది ఆ నౌకలను తగ‌లబెడతారు" అని ఇరాన్ హెచ్చ‌రించింది. ఇరాన్ హెచ్చ‌రిక‌ల‌తో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

అత్యంత కీలక మార్గం..

హ‌ర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు ఎగుమతి మార్గం. ఇది అత్యంత ఇరుకైన ప్ర‌దేశం. కేవలం 33 కిలోమీటర్ల (21 మైళ్ళు) వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్ర‌పంచంలో వాడే ఐదో వంతు చ‌మురు ఈ మార్గం గుండానే ర‌వాణా అవుతుంది. ఇది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రధాన గల్ఫ్ చమురు ఉత్పత్తి దేశాలను గల్ఫ్ ఆఫ్ ఒమ‌న్‌, అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చ‌మురు భార‌త్‌, జ‌పాన్‌, చైనా, ద‌క్షిణ కొరియా దేశాల‌కు ఎగుమ‌తవుతుంటుంది. అందుకే ఈ జ‌ల‌సంధిలో ఏదైనా అంత‌రాయం ఏర్ప‌డితే.. ఆ ప్ర‌భావం ప్రపంచంపై ప‌డుతుంది. చ‌మురు ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతాయి. అందుకే త‌మ‌పై జ‌రిగే ఏ దాడుల‌కైనా ప్ర‌తీకారంగా ఈ జ‌ల‌మార్గాన్ని మూసివేస్తామంటూ ఇరాన్ ఏళ్ల త‌ర‌బ‌డి హెచ్చ‌రిస్తూ వ‌స్తోంది. ఇప్పుడు ఈ హెచ్చ‌రిక‌ల‌ను టెహ్రాన్ అమ‌ల్లోకి తెచ్చింది.

Also Read..

Asia Markets | వ‌రుస‌గా రెండో రోజూ ఆసియా మార్కెట్ల ప‌త‌నం.. క్రిప్టోల్లోనూ న‌ష్ట‌మే..

Iran | అమెరికా ఎంబ‌సీపై ఇరాన్ దాడి.. రియాద్‌లో ఉద్రిక్త‌త‌

Chandra Grahan | నేడు సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం.. హైద‌రాబాద్‌లో ఎప్పుడు క‌నిపిస్తుందంటే?

Advertisement
Advertisement