త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi | ఖ‌మేనీ హ‌త్య‌పై మౌనం ఎందుకు..? ఇదేనా మీ విదేశాంగ విధానం..? కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన సోనియా గాంధీ

Sonia Gandhi | ఇరాన్ సుప్రీం లీడ‌ర్ (Iran Supreme Leader) అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ (Ayatollah Ali Khamenei) మ‌ర‌ణంపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

D

National | Published On Mar 3, 2026, 10.43 am IST

Sonia Gandhi | ఖ‌మేనీ హ‌త్య‌పై మౌనం ఎందుకు..? ఇదేనా మీ విదేశాంగ విధానం..? కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన సోనియా గాంధీ
Advertisement

Sonia Gandhi | ఇరాన్ సుప్రీం లీడ‌ర్ (Iran Supreme Leader) అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ (Ayatollah Ali Khamenei) మ‌ర‌ణంపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఖ‌మేనీ మ‌ర‌ణంపై మౌనంగా ఉండ‌టం అంటే త‌ట‌స్థంగా ఉండ‌టం కాద‌ని.. అది బాధ్య‌త నుంచి త‌ప్పుకోవ‌డ‌మే అని వ్యాఖ్యానించారు. టెహ్రాన్‌తో న్యూఢిల్లీకి ఉన్న సంబంధాలు సాంస్కృతిక‌మైన‌, వ్యూహాత్మ‌క‌మైన‌వ‌ని ఆమె పేర్కొన్నారు.

"ఇజ్రాయెల్‌-అమెరికా జ‌రిపిన దాడుల్లో త‌మ నాయ‌కుడు ఖ‌మేనీ మ‌ర‌ణించిన‌ట్లు ఇరాన్ ధృవీక‌రించింది. చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ దేశాధినేత‌ను హ‌త్య చేయ‌డం సమకాలీన అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్ర చీలికను సూచిస్తుంది. ఖ‌మేనీ మ‌ర‌ణంపై ఢిల్లీ ఎందుకు మౌనంగా ఉంది..? మొద‌ట్లో అమెరికా-ఇజ్రాయెల్ జ‌రిపిన భారీ దాడుల‌ను విస్మ‌రించి ప్ర‌ధాని మోదీ (PM Modi) కేవ‌లం యూఏఈపై ఇరాన్ జ‌రిపిన ప్ర‌తీకార దాడుల‌ను ఖండించ‌డానికే ప‌రిమిత‌మ‌య్యారు. ఆ దాడుల‌కు దారితీసిన ప‌రిస్థితుల‌ను ఆయ‌న ప్ర‌స్తావించ‌లేదు. ఆ త‌ర్వాత తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ.. చ‌ర్చ‌లు, దౌత్యం గురించి మాట్లాడారు. కానీ, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జ‌ర‌గ‌క‌ముందు ఇక్క‌డ జ‌రుగుతున్న‌ది కూడా చ‌ర్చ‌లే క‌ద‌. ఓ విదేశీ నేత‌ను ల‌క్ష్యంగా చేసుకొని చేసిన హ‌త్య‌పై భార‌త్ మౌనం వ‌హించ‌డం త‌ట‌స్థం కాదు. అది మ‌న విదేశీ విధానం యొక్క విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీసే బాధ్య‌తా రాహిత్యం. ఇది మ‌న విదేశాంగ విధానం యొక్క దిశ‌, విశ్వ‌స‌నీత‌పై తీవ్ర‌మైన సందేహాలు త‌లెత్తుతున్నాయి" అని సోనియా వ్యాఖ్యానించారు.

నెత‌న్యాహు ప్ర‌భుత్వానికి నిస్సందేహంగా మ‌ద్ద‌తు అంటే..

మ‌రోవైపు ఖ‌మేనీ హ‌త్య‌కు కేవ‌లం 48 గంట‌ల ముందే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న ముగించుకొని రావ‌డాన్ని కూడా ప్ర‌స్తావించారు. గాజా యుద్ధంలో మ‌హిళ‌లు, పిల్ల‌లు స‌హా పెద్ద సంఖ్య‌లో పౌరులు మ‌ర‌ణించ‌డం ప‌ట్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. మ‌న ప్ర‌ధాని మాత్రం నెత‌న్యాహు ప్ర‌భుత్వానికి నిస్సందేహంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని సోనియా వ్యాఖ్యానించారు. 2001 ఏప్రిల్‌లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ టెహ్రాన్‌ పర్యటన నుంచి ఇరాన్‌తో భారత్​కు ఉన్న నాగరిక, సమకాలీన సంబంధాలను ప్రస్తుత ప్రభుత్వం గుర్తుంచుకోవడం మంచిదని సోనియా గాంధీ సూచించారు. అటు ఇజ్రాయెల్‌తో భారత్​ సంబంధాలు ఇటీవలి కాలంలో రక్షణ, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం అంతటా విస్తరించాయని పేర్కొన్నారు.

వ‌సుధైక కుటుంబం అనేది ప్ర‌సంగాల‌కే ప‌రిమితం కాకూడ‌దు..

భారత్​కు టెహ్రాన్​తో పాటు టెల్ అవీవ్​కు దౌత్యపరమైన స్వేచ్ఛ ఉందని, అది విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. వ‌సుధైక కుటుంబం అనేది కేవ‌లం ప్ర‌సంగాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకూడ‌ద‌ని సోనియా వ్యాఖ్యానించారు. న్యాయం, శాంతి కోసం నిల‌బ‌డ‌ట‌మే దాని అర్థ‌మ‌ని పేర్కొన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో అంతర్జాతీయ సమస్యలపై తప్పనిసరిగా చర్చించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.

కాగా, ఖ‌మేనీ మ‌ర‌ణంపై కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా విడుద‌ల చేయ‌లేదు. కానీ మ‌ధ్య‌ప్రాచ్యంలో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. భార‌త్ ఎప్ప‌టికీ శాంతినే కోరుకుంటుంద‌న్నారు. చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని వ్యాఖ్యానించారు.

Also Read..

హ‌ర్ముజ్‌లోకి నౌక‌లు వ‌స్తే త‌గ‌ల‌బెడ‌తాం : ఇరాన్‌

యుద్ధం, ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నా.. కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

అమెరికా ఎంబ‌సీపై ఇరాన్ దాడి.. రియాద్‌లో ఉద్రిక్త‌త‌

Advertisement
Advertisement