త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

How Israel Tracked Khamenei | ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్‌వ‌ర్క్‌.. ఖ‌మేనీ క‌ద‌లిక‌ల‌ను ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసిందంటే..?

How Israel Tracked Khamenei | ఇరాన్ సుప్రీం లీడ‌ర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖ‌మేనీ (Ayatollah Ali Khamenei)ని ప‌ట్ట‌ప‌గ‌లే హ‌త్య చేయ‌డం ప్రపంచాన్ని ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేస్తోంది. అత్యంత క‌ట్టుదిట్ట‌మైన నిఘా నెట్‌వ‌ర్క్ ఉన్న ఇరాన్‌లో ఆ దేశాధినేత‌పై క‌చ్చిత‌త్వంతో దాడి జ‌ర‌గ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది.

D

International | Published On Mar 3, 2026, 11.28 am IST

How Israel Tracked Khamenei | ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్‌వ‌ర్క్‌.. ఖ‌మేనీ క‌ద‌లిక‌ల‌ను ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసిందంటే..?
Advertisement

How Israel Tracked Khamenei | ఇరాన్ సుప్రీం లీడ‌ర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖ‌మేనీ (Ayatollah Ali Khamenei)ని ప‌ట్ట‌ప‌గ‌లే హ‌త్య చేయ‌డం ప్రపంచాన్ని ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేస్తోంది. అత్యంత క‌ట్టుదిట్ట‌మైన నిఘా నెట్‌వ‌ర్క్ ఉన్న ఇరాన్‌లో ఆ దేశాధినేత‌పై క‌చ్చిత‌త్వంతో దాడి జ‌ర‌గ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది. అయితే, ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ కీల‌క పాత్ర పోషించింది. గత కొన్నేళ్లుగా ఖ‌మేనీ క‌ద‌లిక‌ల‌ను టెల్ అవీవ్ ట్రాక్ చేస్తున్న‌ట్లు బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ పటిష్ఠమైన భద్రతా వలయాన్ని ఛేదించేందుకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ (Mossad) ఏళ్ల తరబడి గ్రౌండ్ వర్క్ చేసిందని, ఇందుకు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగించిందని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.

స‌ద‌రు నివేదిక ప్ర‌కారం.. ఖ‌మేనీ హ‌త్య‌కు ముందు సుప్రీం లీడ‌ర్‌తోపాటూ ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది క‌ద‌లిక‌ల‌పై ఇజ్రాయెల్ నిఘా పెట్టింది. టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరా నెట్‌వ‌ర్క్‌ను మొసాద్ కొన్నేళ్ల క్రితమే హ్యాక్ చేసింది. టెహ్రాన్ నగర ట్రాఫిక్ ఫుటేజీ ఎప్పటికప్పుడు టెల్ అవీవ్‌, ద‌క్షిణ ఇజ్రాయెల్‌లో ఉన్న స‌ర్వ‌ర్ల‌కు ర‌హ‌స్యంగా బదిలీ అయ్యేది. వీటి ద్వారా ఖ‌మేనీ ప్ర‌యాణించే మార్గాల‌ను, ఆయ‌న భ‌ద్ర‌తా వ‌ల‌యాన్ని టెల్ అవీవ్ నిరంత‌రం గ‌మ‌నిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఖమేనీ నివాసం ఉండే పాశ్చర్ స్ట్రీట్ పరిసరాల్లోని కెమెరాల ద్వారా ఆయ‌న భద్రతా సిబ్బంది కదలికలను ఏళ్ల తరబడి విశ్లేషించింది. వారి కార్ల పార్కింగ్, ప్రయాణ మార్గాలను గమనించి వారి దినచర్యను మ్యాప్ చేసింది.

ఈ నెట్‌వ‌ర్క్‌తో అమెరికా-ఇజ్రాయెల్ నిఘా అధికారులు ఖమేనీ క‌ద‌లిక‌ల‌ను అధ్యయనం చేశారు. ఆయ‌న ఎక్క‌డ నివ‌సిస్తున్నారు..? ఎవ‌రెవ‌రిని క‌లుస్తున్నారు..? ఇత‌రుల‌తో ఎలా క‌మ్మూనికేట్ అవుతారు..? దాడుల ముప్పు పొంచి ఉన్న‌ప్పుడు ఆయ‌న ఎక్క‌డికి వెళ్లే అవ‌కాశం ఉంది..? అనే విష‌యాల‌పై నిఘా పెట్టారు. ఖ‌మేనీ స‌మావేశ‌మ‌య్యే సైనికాధికారుల క‌ద‌లిక‌ల‌ను కూడా ట్రాక్ చేశారు. అంతేకాదు మొబైల్ ఫోన్ సిస్ట‌మ్స్‌లోకి కూడా మొసాద్ చొర‌బ‌డింది. ఖమేనీ అంగరక్షకుల ఫోన్లను ట్రాక్ చేయడం ద్వారా ఆయన సమావేశమయ్యే ప్రదేశాలను కచ్చితంగా గుర్తించింది. ఈ క్ర‌మంలో ఖ‌మేనీతో స‌హా ఇరాన్ అగ్ర‌శ్రేణి అధికారులు శ‌నివారం ఉద‌యం టెహ్రాన్‌లోని ఓ ప్రాంతంలో స‌మావేశం అవుతార‌ని క‌నిపెట్టింది.

ప్ర‌ణాళిక ప్ర‌కారం రాత్రి స‌మ‌యంలో దాడి చేయాల‌ని భావించింది. అయితే, చివ‌రి నిమిషంలో ప్లాన్ మారింది. ప‌ట్ట‌ప‌గ‌లే దాడికి రెఢీ అయ్యింది. దాడికి ముందు రోజు ఆ ప్రాంతంలోని డజనుకు పైగా మొబైల్ టవర్లను సాంకేతికంగా నిలిపివేసింది. దీంతో భద్రతా సిబ్బంది ఫోన్లకు ఎలాంటి హెచ్చరికలూ అందకుండా, కాల్స్ 'బిజీ' అని వచ్చేలా చేసింది. ఇక ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం.. శ‌నివారం ఉద‌యం ఖ‌మేనీ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమాచారాన్ని ధ్రువీకరించుకున్న వెంటనే ఇజ్రాయెల్-అమెరికాకు చెందిన 200 యుద్ధ విమానాలు హుటాహుటిన టెహ్రాన్‌లోకి ప్రవేశించాయి. ఖమేనీ నివాసంపై 30 బంకర్ బస్టర్ బాంబులను జారవిడిచి వెళ్లిపోయాయ‌ని సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.

Also Read..

ఖ‌మేనీ హ‌త్య‌పై మౌనం ఎందుకు..? ఇదేనా మీ విదేశాంగ విధానం..? కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన సోనియా గాంధీ

హ‌ర్ముజ్‌లోకి నౌక‌లు వ‌స్తే త‌గ‌ల‌బెడ‌తాం : ఇరాన్‌

యుద్ధం, ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నా.. కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

Advertisement
Advertisement