త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | 25 ఏళ్ల ప్ర‌జాప్ర‌స్థానం.. వినాయ‌కుడికి ప్ర‌ధాని ప్ర‌త్యేక పూజ‌లు

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్రజా జీవితంలోకి (public office) అడుగుపెట్టి నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో ఉన్న వినాయక మందిర్‌ను ప్ర‌ధాని సంద‌ర్శించారు.

D

National | Published On Oct 7, 2026, 11.03 am IST

PM Modi | 25 ఏళ్ల ప్ర‌జాప్ర‌స్థానం.. వినాయ‌కుడికి ప్ర‌ధాని ప్ర‌త్యేక పూజ‌లు
Advertisement

PM Modi | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్రజా జీవితంలోకి (public office) అడుగుపెట్టి నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో ఉన్న వినాయక మందిర్‌ను ప్ర‌ధాని సంద‌ర్శించారు. ఉద‌య‌మే ఆల‌యానికి చేరుకున్న ప్ర‌ధాని.. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. విఘ్నేషుడి కృపతో భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ప్ర‌ధాని ఎక్స్ వేదిక‌గా షేర్ చేశారు (PM Modis 25 years in public service). దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాల‌తో, ఆయురారోగ్యాలతో జీవించాల‌ని వినాయకుడిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. మోదీ 25 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు 'సేవా సంకల్ప్ అభియాన్' పేరిట వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే.

కాగా, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అక్టోబ‌ర్ 7, 2001న తొలిసారి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. 2014 వ‌ర‌కూ గుజ‌రాత్ సీఎంగానే కొన‌సాగారు. అనంత‌రం 2014 మే 26న భార‌త ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి వ‌రుస‌గా మూడో ప‌ర్యాయం ఆయ‌న ప్ర‌ధానిగా కొనసాగుతూ దేశాన్ని ముందుకు న‌డిపిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 7 నాటికి మోదీ రాజ్యాంగబద్ధమైన ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ప్ర‌ధాని మోదీ పాల‌న‌లో కీల‌క మైలు రాళ్లు

ప్ర‌ధానిగా మోదీ ఎన్నో చారిత్రాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకువస్తూ జీఎస్టీ (GST) అమలు చేయడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, పెద్ద నోట్ల రద్దు వంటి ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌తోపాటూ కోట్లాది మంది పేదలకు పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, ఉచిత విద్యుత్, ఉజ్వల యోజన పథకం (PMUY) ద్వారా పేద కుటుంబాల మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించడం వంటి అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టారు.

అంతేకాదు, జాతీయ ర‌హ‌దారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, వందేభార‌త్ రైళ్ల ద్వారా ర‌వాణా రంగాన్ని బ‌లోపేతం చేశారు. వీటితోపాటూ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. జమ్ము కశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హోదాను (ఆర్టిక‌ల్ 370) ర‌ద్దు చేశారు. జమ్ము కశ్మీర్, లడఖ్‌ల‌ను రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా (Union Territories) విభజించారు. దశాబ్దాల నాటి భారతీయుల ఆధ్యాత్మిక ఆకాంక్ష అయిన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం మోదీ హ‌యాంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

Also Read..

ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి.. సెన్సెక్స్ 462 పాయింట్లు పతనం..

సీఎం రేవంత్ రెడ్డి వాటా ఎంత‌?.. గీతా హ్యుందాయ్ ముందు వెలసిన ఫ్లెక్సీలు

న‌ల్ల‌స‌ముద్రంలో ఆయిల్ ట్యాంక‌ర్‌పై ఉక్రెయిన్ డ్రోన్‌ దాడి.. సిబ్బంది అంతా భార‌తీయులే

Advertisement
Advertisement