త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Geetha Hyundai | సీఎం రేవంత్ రెడ్డి వాటా ఎంత‌?.. గీతా హ్యుందాయ్ ముందు వెలసిన ఫ్లెక్సీలు

Geetha Hyundai | హైద‌రాబాద్‌లో (Hyderabad) మ‌రోసారి ఫ్లెక్సీలు (Flex Banners) క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ నెల 4న‌ `కంగ్రాట్స్ రేవంత్ రెడ్డి.. రూ.13,200 కోట్లు` అంటూ సికింద్రాబాద్‌లోని మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ ముందు బ్యాన‌ర్లు ద‌ర్శ‌న‌మిచ్చిన విష‌యం తెలిసిందే.

G

Hyderabad | Published On Oct 7, 2026, 9.23 am IST

Geetha Hyundai | సీఎం రేవంత్ రెడ్డి వాటా ఎంత‌?.. గీతా హ్యుందాయ్ ముందు వెలసిన ఫ్లెక్సీలు
Advertisement

Geetha Hyundai | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) మ‌రోసారి ఫ్లెక్సీలు (Flex Banners) క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ నెల 4న‌ `కంగ్రాట్స్ రేవంత్ రెడ్డి.. రూ.13,200 కోట్లు` అంటూ సికింద్రాబాద్‌లోని మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ ముందు బ్యాన‌ర్లు ద‌ర్శ‌న‌మిచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా న‌గ‌రంలోని గీతా హుందాయ్ (Geetha Hyundai) షోరూమ్ వ‌ద్ద `అర్ధ‌మైందా రాజా` అంటూ పెద్ద ఎత్తున ఫెక్సీలు ఏర్పాటు చేశారు. 675 ఎకరాలు, రూ.8,528 కోట్ల ప్రాజెక్టులో గీతా హ్యుందాయ్ వాటా ఎంత‌? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ప్రశ్నిస్తూ గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. దీంతో ర‌హ‌దారివెంట వ‌చ్చివెళ్లే వాహ‌న‌దారులు ఆ బ్యాన‌ర్ల‌ను ఆస‌క్తిగా చూస్తున్నారు.

Advertisement
Advertisement