Drone Attack | నల్లసముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. సిబ్బంది అంతా భారతీయులే
Drone Attack | నల్లసముద్రంలో లైబీరియా (Liberia) జెండాతో ప్రయాణిస్తున్న అఫ్రామాక్స్ రియో (Aframax Rio) అనే చమురు ట్యాంకర్‌పై ఉక్రెయిన్ (Ukrain) డ్రోన్ దాడి (Drone Attack) చేసింది.
International | Published On Oct 7, 2026, 8.12 am IST
Drone Attack | త్రినేత్ర న్యూస్: నల్లసముద్రంలో లైబీరియా (Liberia) జెండాతో ప్రయాణిస్తున్న అఫ్రామాక్స్ రియో (Aframax Rio) అనే చమురు ట్యాంకర్‌పై ఉక్రెయిన్ (Ukrain) డ్రోన్ దాడి (Drone Attack) చేసింది. దీంతో ట్యాంకర్‌లో (Oil Tanker) భారీగా మంటలు చెలరేగాయి. ట్యాంకర్ ఉన్న సిబ్బంది అంతా భారతీయులే (Indian Crew) కావడం గమనార్హం. అయితే ఓడలోని 23 మంది సిబ్బందిని రష్యా (Russia) సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో వాటిని అదుపుచేయడం అగ్నిమాపక సిబ్బందికి సాధ్యం కాలేదని రష్యా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రష్యాలోని ప్రముఖ రిసార్ట్ నగరం సోచి (Sochi) సమీపంలోని నల్లసముద్ర తీరంలో (Black Sea) ఈ దాడి జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన నౌకాదళ డ్రోన్లు (Naval Drones) ఈ దాడికి పాల్పడ్డాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యవసర సహాయక చర్యలు చేపట్టిందని, సిబ్బందిలోని 23 మంది భారతీయ నావికులను ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారని తెలిపింది. దాడితో సోచి నగరం సమీపంలో దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. ముందుజాగ్రత్త చర్యగా తీరప్రాంతం, బీచ్‌లకు ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. నీటి నాణ్యతను నిరంతరం పరీక్షిస్తున్నారు. రోమేనియా తీరంలో మరో నౌక ప్రమాదానికి గురై మునిగిపోయిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరు అదృశ్యమయ్యారు.
కాగా, రష్యా చమురు రంగాన్ని, దాని షాడో ఫ్లీట్ (రష్యా చమురును రహస్యంగా రవాణా చేసే నౌకలు) లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఇటీవల దాడులను ముమ్మరం చేసింది. ఈ ‘అఫ్రామాక్స్ రియో’ ట్యాంకర్ ఇదివరకే ఉక్రెయిన్ ఆంక్షల జాబితాలో ఉంది. 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా, ఉక్రెయిన్ (Russia Ukrain War) దేశాలు నల్లసముద్రం పరిసరాల్లోని వాణిజ్య నౌకలను తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
A man plays his guitar in Sochi Russia tonight with in the background a burning oil tanker hit by drones lighting up the sky. https://t.co/vSiGu3MWep
— WarMonitor🇺🇦🇬🇧 (@WarMonitor3) October 6, 2026
సంబంధిత వార్తలు

Pneumonic Plague | సైబీరియాలో న్యుమోనిక్ ప్లేగ్ కలకలం.. ఏంటిది.. ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి..?
అక్టోబర్ 6, 2026

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
సెప్టెంబర్ 22, 2026

BRICS Summit | భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో ఈ నెల 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లారో ఇక అంతే..!
- ●TGSRTC | భారీగా తగ్గిన ఏసీ బస్సు చార్జీలు.. నేటి నుంచే అమల్లోకి
- ●Naval Dockyard | నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్లో 283 ఖాళీలు
- ●Horoscope | అక్టోబర్ 7 రాశిఫలాలు.. విదేశీ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు!
- ●Revanth Reddy Slams BJP | రాహుల్ పోరాటానికి కేంద్రం గజగజ.. సీఈసీ రాజీనామా చేసేవరకు విశ్రమించం
- ●Captain Smit Machchhar | 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు అమెరికా చట్టసభ సలాం

Traffic Restrictions | హైదరాబాద్‌లో ఈ నెల 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లారో ఇక అంతే..!

TGSRTC | భారీగా తగ్గిన ఏసీ బస్సు చార్జీలు.. నేటి నుంచే అమల్లోకి

Naval Dockyard | నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్లో 283 ఖాళీలు

Horoscope | అక్టోబర్ 7 రాశిఫలాలు.. విదేశీ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు!



