త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | రాహుల్‌కు ప్ర‌ధాని మోదీ బ‌ర్త్‌డే విషెస్‌

PM Modi | కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్ర‌తిప‌క్ష‌నేత‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

D

National | Published On Jun 19, 2026, 12.00 pm IST

PM Modi | రాహుల్‌కు ప్ర‌ధాని మోదీ బ‌ర్త్‌డే విషెస్‌
Advertisement

PM Modi | కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప‌లువురు ప్ర‌ముఖులు రాహుల్‌కు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) సైతం ప్ర‌తిప‌క్ష‌నేత‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

ప్ర‌ధాని మోదీతోపాటూ కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) సైతం రాహుల్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. "రాజ్యాంగం ప‌ట్ల మీ అచంచ‌ల‌మైన అంకిత‌భావం, అణ‌గారిన గొంతుక‌ల కోసం మీరు చేస్తున్న రాజీలేని పోరాటం ల‌క్ష‌లాది మందికి స్ఫూర్తినిచ్చాయి. సమ్మిళితత్వం, సామాజిక న్యాయం, సామరస్యం, కరుణ అనే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలు మీ ప్రజా జీవితంలో, నాయకత్వంలో ప్రతిఫలిస్తాయి. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, దేశ సేవ‌లో జీవించాల‌ని ఆకాంక్షిస్తున్నాను" అని ఖ‌ర్గే త‌న‌ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.

Also Read..

టెలిగ్రామ్‌పై నిషేధం స‌రైన నిర్ణ‌య‌మే : ఢిల్లీ హైకోర్టు

జన్ జడ్ ఆకాంక్షల మేర‌కు రాహుల్ ప్ర‌ధాని కావాలి : మంత్రి పొన్నం

ఒక్క రోజులోనే రూ.36వేలు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. కొనుగోళ్లకు చాన్స్ వ‌చ్చిందా..?

Advertisement
Advertisement