త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | జన్ జడ్ ఆకాంక్షల మేర‌కు రాహుల్ ప్ర‌ధాని కావాలి : మంత్రి పొన్నం

Ponnam Prabhakar | బావి భారత జన్ జడ్ ఆకాంక్షల మేర‌కు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్ర‌ధాని కావాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ఆకాంక్షించారు. మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్ (Ministers Quarters)లో రాహుల్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

D

Telangana | Published On Jun 19, 2026, 10.48 am IST

Ponnam Prabhakar | జన్ జడ్ ఆకాంక్షల మేర‌కు రాహుల్ ప్ర‌ధాని కావాలి : మంత్రి పొన్నం
Advertisement

Ponnam Prabhakar | కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు రాహుల్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్ (Ministers Quarters)లో రాహుల్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) నిర్వ‌హించారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల మ‌ధ్య కేక్ క‌ట్ చేసి కాంగ్రెస్ అగ్రనేత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

అనంత‌రం మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. బావి భారత జన్ జడ్ ఆకాంక్షల మేర‌కు రాహుల్ ప్ర‌ధాని కావాల‌ని ఆకాంక్షించారు. ఆయ‌న దేశ దిశ ద‌శ మారుస్తార‌న్నారు. భారత్ జోడోయాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా అంద‌రూ క‌లిసి ప్ర‌జాస్వామికంగా ఉండాల‌ని నప్రత్ చోడో భారత్ జోడో అని ఎటువంటి విద్వేషాలతో బతకద్దని పిలుపునిచ్చిన వ్యక్తి రాహుల్ అని కొనియాడారు. రాహుల్ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు మంత్రి పొన్నం తెలిపారు.

Also Read..

జీటీఏ 6 వ‌చ్చేస్తోంది.. ప్రీ ఆర్డ‌ర్లు షురూ.. విడుద‌ల ఎప్పుడు అంటే..?

ఐటీ షేర్లు భారీగా ప‌త‌నం.. తీవ్ర న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు.. ప్రారంభ‌మైన ద‌ర‌ఖాస్తులు

Advertisement
Advertisement