త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.36వేలు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. కొనుగోళ్లకు చాన్స్ వ‌చ్చిందా..?

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం చోటు చేసుకుని సంత‌కాలు జ‌రిగిన‌ప్ప‌టికీ అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మాత్రం కాస్త ఆందోళ‌న‌తోనే కొన‌సాగుతున్నాయి. పెట్టుబ‌డిదారుల్లో సెంటిమెంట్ బ‌లంగా క‌నిపించ‌డం లేదు. దీంతో చాలా వ‌ర‌కు స్టాక్ మార్కెట్ల‌లో లాభాల బుకింగ్ క‌నిపిస్తోంది.

S

Business | Published On Jun 19, 2026, 11.11 am IST

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.36వేలు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. కొనుగోళ్లకు చాన్స్ వ‌చ్చిందా..?
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం చోటు చేసుకుని సంత‌కాలు జ‌రిగిన‌ప్ప‌టికీ అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మాత్రం కాస్త ఆందోళ‌న‌తోనే కొన‌సాగుతున్నాయి. పెట్టుబ‌డిదారుల్లో సెంటిమెంట్ బ‌లంగా క‌నిపించ‌డం లేదు. దీంతో చాలా వ‌ర‌కు స్టాక్ మార్కెట్ల‌లో లాభాల బుకింగ్ క‌నిపిస్తోంది. ఇక ఇదే ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా ప‌డింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ఔన్స్ బంగారం ధ‌ర 2.08 శాతం మేర ప‌త‌న‌మైన 4,132 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 3.46 శాతం మేర త‌గ్గి 63.44 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లోనూ గోల్డ్‌, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ భారీగా క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,075 పాయింట్ల‌కు పైగా ప‌త‌న‌మై 1,46,234 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 8,772 పాయింట్లు క్షీణించి 2,28,800 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,586 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16, 688 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,45,860 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,58,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.36,500 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,370 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,06,960గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,33,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,37,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.33,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,939 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.87,512గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,09,390 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,93,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.27,400 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు త‌గ్గింది. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550 గా ఉంది.

Advertisement
Advertisement