PM Modi | పిల్లల్ని రెచ్చగొట్టొద్దు.. పేపర్ లీక్‌లను అరికట్టడం జాతీయ బాధ్యత.. నీట్ వివాదంపై ప్రధాని మోదీ
PM Modi | నీట్ పేపర్ లీక్ (NEET paper leak) అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. పేపర్ లీక్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేసి న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. లీకేజీ ఘటనలు జరగకుండా చూసుకోవడం దేశ బాధ్యతగా భావించాలని ప్రధాని అన్నారు.
PM Modi | నీట్ పేపర్ లీక్ (NEET paper leak) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో దేశ విద్యావ్యవస్థలో అక్రమాలపై కాక్రోచ్ జనతాపార్టీ నిర్వహించిన చలో పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ పరిణామాల వేళ నీట్ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. పేపర్ లీక్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేసి న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్పందీ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. లీకేజీ ఘటనలు జరగకుండా చూసుకోవడం దేశ బాధ్యతగా భావించాలని ప్రధాని అన్నారు.

ఇవాళ ఉదయం జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్డీయే (NDA) పార్లమెంటరీ పార్టీ మంగళ్ మిలన్ సమావేశంలో (NDA Parliamentary Party meeting) ప్రధాని మాట్లాడారు. ఈ విషయాన్నికేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) మీడియాకు తెలిపారు. అత్యంత సురక్షితమైన, ఎలాంటి లోపాలు లేని పరీక్షల విధానాన్ని నిర్మించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
"నీట్ పేపర్ లీక్ అయినట్లు సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించింది. దీనికి బాధ్యులైన వారిని అరెస్టు చేయడంతో పాటు వేగవంతమైన చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు నష్టం జరగకుండా వెంటనే నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలను సైతం విడుదల చేశాం. పేపర్ లీక్ ఘటన ఒక కేంద్రానిదే కాదు.. అనేక రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉంది. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. వారి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ప్రధాని మోదీ చెప్పినట్లు రిజిజు వివరించారు.
శాసనసభ వ్యవహారాలకు మద్దతుగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఏకతాటిపై నిలవాలని ప్రధాని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దేశ భవిష్యత్తు కోసం, యువత సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టకుండా.. వారికి సరైన మార్గం చూపించాలని ప్రధాని ఎంపీలందరికీ సూచించినట్లు కిరణ్ రిజుజు వెల్లడించారు.
Also Read..
ఎంపీల కొనుగోళ్లపై పార్లమెంట్‌లో చర్చ జరపాలి.. స్పీకర్‌కు ఎంపీ చామల కిరణ్ వాయిదా తీర్మానం..
నేటి నుంచి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు.. ఆగస్టు 10 వరకు అవకాశం..
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై ఆశాభావం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
తాజావార్తలు
- ●Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్
- ●Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
- ●CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
- ●Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
- ●BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!
- ●Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య

Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్

Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ






