త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddaramaiah | ఇక‌పై ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌ను : సిద్ధ‌రామ‌య్య‌

Siddaramaiah | క‌ర్ణాట‌క మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సిద్ధరామ‌య్య( Siddaramaiah )సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే కాదు.. ఇక‌పై ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌బోన‌ని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

S

National | Published On Jul 26, 2026, 5.10 pm IST

Siddaramaiah | ఇక‌పై ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌ను : సిద్ధ‌రామ‌య్య‌
Advertisement

Siddaramaiah | త్రినేత్ర‌.న్యూస్ : క‌ర్ణాట‌క మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సిద్ధరామ‌య్య( Siddaramaiah )సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే కాదు.. ఇక‌పై ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌బోన‌ని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత రాజ‌కీయాలు పూర్తిగా భ్ర‌ష్టు ప‌ట్టిపోయాయ‌ని, దీంతో పాటు వ‌యసు కూడా పైబ‌డి పోయిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు సిద్ధ‌రామ‌య్య పేర్కొన్నారు.

శనివారం మాండ్య జిల్లాలోని కేఆర్‌పేటలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సిద్ధ‌రామ‌య్య ఇలా వ్యాఖ్యానించారు. నేడు రాజ‌కీయాలు పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టిపోయాయి. కాబ‌ట్టి 2028 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంటాను. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయాల్లో చురుకుగా ఉంటూనే ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకుంటాను. మ‌రోసారి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌మ‌ని న‌న్ను వ‌రుణ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కోరుతున్నారు. కానీ ఇక‌పై ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌కూడ‌ద‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నాను. గ‌తంలో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే నాకు డ‌బ్బు ఖ‌ర్చుపెట్టి గెలిపించేవారు. కానీ నేడు అలాంటి ప‌రిస్థితి లేదు అని సిద్ధ‌రామ‌య్య పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం నా వ‌య‌సు 79 ఏళ్లు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ప‌ద‌వీకాలం మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం మిగిలి ఉంది. ఆ స‌మ‌యానికి నాకు 82 ఏళ్లు నిండుతాయి. ఇక ఆరోగ్యం కూడా స‌హ‌క‌రించ‌డం లేదు. గ‌తంలో మాదిరి ఉత్సాహంగా ప‌ని చేయ‌డం కూడా సాధ్యం కాదు. 2028 నాటికి నా రాజ‌కీయ జీవితానికి 50 ఏళ్లు నిండుతాయి. 1978లో తొలిసారిగా తాలుకా బోర్డు స‌భ్యుడిగా రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించాను. నా జీవితంలో గెలుపోట‌ముల‌ను చూశాను. అయితే నేను న‌మ్మిన సిద్ధాంతానికి విరుద్ధంగా ఎప్పుడు కూడా ప్ర‌వ‌ర్తించ‌లేదు. అది సంతృప్తినిస్తుంది. నేడు నిజాయితీ గ‌ల రాజ‌కీయాల‌కు తావు లేదు. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్‌లో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాను. ఐదు ద‌శాబ్దాలుగా క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు త‌మ కుటుంబ స‌భ్యుడిగా ఆప్యాయంగా చూసుకున్నారు. ఆ రుణం ఎప్ప‌టికీ తీరిపోనిది. అందుకే భ‌విష్య‌త్ కూడా ప్ర‌జా సేవ‌కే అంకితం చేయ‌బ‌డుతుంద‌ని సిద్ధ‌రామ‌య్య ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement