త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Houses | నేటి నుంచి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు.. ఆగస్టు 10 వరకు అవకాశం..

Indiramma Houses | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచి ప్రారంభమైంది. క్యూర్ (GHMC Core Urban Region) పరిధిలో అర్హులైన పౌరులు మీ సేవ కేంద్రాలు, మీ సేవ వాట్సాప్ సేవ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

S

Telangana | Published On Jul 21, 2026, 11.35 am IST

Indiramma Houses | నేటి నుంచి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు.. ఆగస్టు 10 వరకు అవకాశం..
Advertisement

Indiramma Houses | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచి ప్రారంభమైంది. క్యూర్ (GHMC Core Urban Region) పరిధిలో అర్హులైన పౌరులు మీ సేవ కేంద్రాలు, మీ సేవ వాట్సాప్ సేవ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ వేదికలకు అనుసంధానించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలి..

సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి ఇందిరమ్మ ఇండ్ల‌ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ వాట్సాప్: 8096958096 నంబర్‌కు Hi అని పంపి చాట్‌బాట్ సూచనలను అనుసరిస్తూ మొబైల్ ఫోన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మీ సేవ పోర్టల్ meeseva.telangana.gov.in ద్వారా కూడా దరఖాస్తు సమర్పించడంతోపాటు స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవ‌చ్చు. కాగా దరఖాస్తు సమయంలో లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు వివరాల‌ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అవసరమైన పత్రాల స్కాన్ కాపీలు లేదా స్పష్టమైన ఫోటోలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. మీ సేవ, మీ సేవ వాట్సాప్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతోపాటు, పేపర్‌వర్క్ తగ్గి దరఖాస్తు స్థితిని పారదర్శకంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను డిజిటల్, మొబైల్ వేదికల ద్వారా మరింత చేరువ చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మీసేవ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement