త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ స‌పోర్ట్ స్టాఫ్‌పై చ‌ర్చించే ఛాన్స్‌..!

BCCI Review | టీమిండియా ఇటీవలి ప్రదర్శనపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్ష నిర్వహించనుంది. ఆగస్టు తొలివారంలో స‌మావేశం జ‌రుగ‌నుంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, జింబాబ్వే పర్యటనల్లో జట్టు ప్రదర్శనపై చర్చించనున్నట్లు సమాచారం. హెడ్‌కోచ్ గౌతమ్‌ గంభీర్‌ సహాయక సిబ్బందిలో కొందరి భవిష్యత్తుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

P

Sports | Published On Jul 26, 2026, 5.14 pm IST

BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ స‌పోర్ట్ స్టాఫ్‌పై చ‌ర్చించే ఛాన్స్‌..!
Advertisement

BCCI Review | టీమిండియా ఇటీవలి ప్రదర్శనపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్ష నిర్వహించనుంది. ఆగస్టు తొలివారంలో స‌మావేశం జ‌రుగ‌నుంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, జింబాబ్వే పర్యటనల్లో జట్టు ప్రదర్శనపై చర్చించనున్నట్లు సమాచారం. హెడ్‌కోచ్ గౌతమ్‌ గంభీర్‌ సహాయక సిబ్బందిలో కొందరి భవిష్యత్తుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా సైతం ఆగస్టులో సమీక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు.

ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ ఓటములపై దృష్టి

శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో భారత జట్టు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2తో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4తో కోల్పోయింది. అయితే, జింబాబ్వే పర్యటనలో పుంజుకున్న భారత్‌ వరుసగా రెండు విజయాలు సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా శ్రేయస్‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం కావ‌డం గ‌మ‌నార్హం. వరుస పరాజయాలు జట్టు ప్రదర్శనపై అనుమానాలు రేకెత్తించడంతో బీసీసీఐ సమగ్ర సమీక్షకు సిద్ధమవుతున్న‌ట్లు తెలుస్తోంది.

సైకియా ఏమ‌న్నారంటే..?

ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌లపై ఓటములు ఆందోళన కలిగించేవేనని, అయితే వాటిని అసాధారణంగా చూడాల్సిన అవసరం లేదని దేవజిత్‌ సైకియా పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి దశలు సహజమేనని, ఇది కేవలం జట్టుకు ఎదురైన ప్రతికూల దశ మాత్రమేనని ఆయన అన్నారు. సమీక్ష సమావేశం ప్రధాన ఉద్దేశం జట్టు ప్రదర్శనను విశ్లేషించడం, మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలను గుర్తించడ‌మేన‌ని సైకియా తెలిపారు.

తొందరపాటు నిర్ణయాలు వద్దన్న గవాస్కర్‌

భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ బీసీసీఐ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. నాలుగు నెలల క్రితమే ఇదే జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిందని, కొన్ని ఓటముల ఆధారంగా భారీ మార్పులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఐపీఎల్‌లోని ఫ్లాట్‌ పిచ్‌లపై ఆడటం వల్ల భారత బ్యాటర్ల సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయని గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా షార్ట్‌ బాల్స్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడడం ఇటీవలి వ‌రుస వైఫల్యాలకు ప్రధాన కారణమని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement