Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే – హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
మృణాల్ ఠాకూర్ హిట్టు అందుకొని చాలా కాలమే అయ్యింది. హిందీతో పాటు తెలుగులో మృణాల్ హీరోయిన్‌గా నటించిన గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ పరాజయాలతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తోండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Entertainment | Published On Jul 26, 2026, 5.31 pm IST
Mrunal Thakur | సినీ పరిశ్రమలో విజయాలను బట్టే నేమ్, ఫేమ్‌తో పాటు రెమ్యూనరేషన్లు మారుతుంటాయి. సక్సెసుల్లో ఉన్న హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్లు పెరగడం కామన్. కానీ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హిట్టు అందుకొని చాలా కాలమే అయ్యింది. అయినా ఈ అమ్మడు భారీగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేయడం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
సీతారామంతో...
2022లో వచ్చిన సీతారామం మూవీతోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతామాలక్ష్మి పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సీతారామం హిట్టుతో మృణాల్‌కు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. ఫ్యామిలీ స్టార్, డెకాయిట్‌తో పాటు హాయ్ నాన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇందులో హాయ్ నాన్న మినహా మిగిలిన రెండు డిజాస్టర్లుగా నిలిచాయి.
ఐదారేళ్లు ....
బాలీవుడ్‌లోనూ మృణాల్ కెరీర్ పరాజయాలతోనే సాగుతోంది. హిట్టు కొట్టి ఐదారేళ్లు దాటిపోయింది. ఆమె గత సినిమాలు హై జవానీతో ఇష్క్ హోనా హై, దో దివానే షెహర్ మే, సన్నాఫ్ సర్ధార్ 2తో పాటు మరికొన్ని బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. పెట్టిన బడ్జెట్‌లో సగం కూడా రాబట్టలేకపోయాయి.
అల్లు అర్జున్ రాకా....
ఈ డిజాస్టర్లతో సంబంధం లేకుండా ప్రస్తుతం మృణాల్ ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్ల మధ్య రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని అంటున్నారు. సీతారామం సినిమాకు ఈ బాలీవుడ్ బ్యూటీ కేవలం 85 లక్షలు మాత్రమే పారితోషికం అందుకుంది. అప్పటి నుంచి విజయాలు లేకపోయినా ప్రతి సినిమాకు తన రెమ్యూనరేషన్‌ను పెంచుతూ వస్తోందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ రాకాలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఐదు కోట్లు రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం. స్క్రీన్ టైమ్ తక్కువే కావడం, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ కావడంతో కోటి నుంచి రెండు కోట్ల వరకు పారితోషికం తగ్గించుకొని ఈ సినిమా ఒప్పుకున్నట్లు చెబుతోన్నారు. మిగిలిన సినిమాల విషయంలో రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్ల మూలంగానే ఆమెకు అవకాశాలు తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!
- ●Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య
- ●Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు
- ●Nirmala Sitharaman | యువతలో ఆమాత్రం స్పిరిట్ ఉండాలి : నిర్మలా సీతారామన్
- ●Ram Charan | రామ్‌చరణ్‌కు సర్జరీ - కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ - ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?
- ●VC Sajjanar | మాటలు నమ్మొద్దు.. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సైబర్ మోసాలు: వీసీ సజ్జనార్

BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!

Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య

Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు

Nirmala Sitharaman | యువతలో ఆమాత్రం స్పిరిట్ ఉండాలి : నిర్మలా సీతారామన్






