PM Modi | సుపరిపాలనకు అదే అసలైన పరీక్ష : ప్రధాని మోదీ
PM Modi | ప్రజలకు సేవ చేయడమే సుపరిపాలనకు (good governance) అసలైన పరీక్ష అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. ప్రధానిగా తన 12 ఏళ్ల పాలనపై మోదీ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు.
PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవలు అందించిన భారత ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ప్రజలకు సేవ చేయడమే సుపరిపాలనకు (good governance) అసలైన పరీక్ష అని పేర్కొన్నారు. "ప్రజలకు సేవ చేయడమే సుపరిపాలనకు అసలైన పరీక్ష. అంకితభావం, వినయం, కర్తవ్య దీక్షతో నిరంతరం పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు" అని ప్రధాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
2014లో తొలిసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఎలాంటి విరామం లేకుండా 4,399 రోజులు (నేటితో) ప్రధానిగా కొనసాగుతున్నారు. తద్వారా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పేరిట ఉన్న రికార్డును అధిగమించి అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా నిలిచారు. 1952లో స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది మే 13న ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు (మొత్తం 4,398 రోజులు) ఆ పదవిలో కొనసాగారు. నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ నేడు అధిగమించారు.
అంతేకాదు, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నేటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రధాని మోదీకి ప్రత్యేకంగా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ప్రధానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read..
ఆ వ్యాఖ్యలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం.. రేవంత్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఫైర్
టీఎంసీకి మరో షాక్.. మరో ఎంపీ రాజీనామా
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. నెహ్రూ రికార్డు బద్దలు.. ఎన్డీయే పాలనకు 12 ఏళ్లు
సంబంధిత వార్తలు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
జులై 28, 2026

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
జులై 28, 2026

Sreelekha Mitra | ప్రధాని మోదీపై అభ్యంతరకరమైన పోస్టర్.. బెంగాలీ నటిపై కేసు
జులై 27, 2026
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్



