త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmendra Pradhan | ధ‌ర్మేంద్ర‌ ప్ర‌ధాన్ రాజీనామాకు బ‌దులు శాఖ మార్పు ప్ర‌తిపాద‌న చేసిన మోదీ స‌ర్కార్‌.. కానీ..

Dharmendra Pradhan | ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామాకు బ‌దులు కాక్రోచ్ పార్టీకి కేంద్ర ప్ర‌భుత్వం ఓ కీల‌క ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు తాజాగా తెలిసింది. ప్ర‌ధాన్ రాజీనామాకు బ‌దులు ఆయ‌న శాఖ‌ను మార్చే కేంద్ర‌ ప్ర‌దిపాద‌నకు సీజేపీ ప్ర‌తినిధులు ఒప్పుకోలేదట‌. ఆయ‌న రాజీనామా చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని తేల్చి చెప్పిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

D

National | Published On Jul 28, 2026, 12.45 pm IST

Dharmendra Pradhan | ధ‌ర్మేంద్ర‌ ప్ర‌ధాన్ రాజీనామాకు బ‌దులు శాఖ మార్పు ప్ర‌తిపాద‌న చేసిన మోదీ స‌ర్కార్‌.. కానీ..
Advertisement

Dharmendra Pradhan | నీట్ పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. కేంద్రంపై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఒత్తిడి మేర‌కు ఆయ‌న మంత్రిప‌ద‌వికి రాజీనామా చేయ‌క త‌ప్ప‌లేదు. అయితే, ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో మోదీ స‌ర్కార్ ప్లాన్ బెడిసికొట్టిన‌ట్లుగా తెలిసింది. ప్ర‌ధాన్ రాజీనామాకు బ‌దులు ఆయ‌న శాఖ‌ను మార్చే ప్ర‌దిపాద‌న కేంద్రం చేసిన‌ట్లు తాజాగా వెల్ల‌డైంది. ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌కు కాక్రోచ్ పార్టీ ప్ర‌తినిధులు నిరాక‌రించ‌డంతో ఆయ‌న‌ రాజీనామా చేయ‌క త‌ప్ప‌లేద‌ని సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

నీట్ పేప‌ర్‌లీక్‌, విద్యా వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాల‌ను నిర‌సిస్తూ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తాపార్టీ ఆధ్వ‌ర్యంలో జులై 20న దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మారిన విష‌యం తెలిసిందే. విద్యార్థి నిర‌స‌న‌ల‌తో దిగొచ్చిన కేంద్రం సీజేపీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మైంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్.. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాకు బ‌దులు ఆయ‌న శాఖ‌ను మారుస్తామ‌ని కేంద్ర మంత్రులు సీజేపీ ప్ర‌తినిధుల‌కు ప్ర‌తిపాదించారు. అయితే, ఈ ప్ర‌తిపాద‌న‌ను సీజేపీ తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శాఖ మారుస్తే స‌రిపోద‌ని.. ఆయ‌న్ని మంత్రివర్గం నుంచే తప్పించాలని సీజేపీ స్ప‌ష్టం చేసిన‌ట్లు పేర్కొన్నాయి. ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కూ త‌మ ఆందోళ‌న‌లు విర‌మించేది లేద‌ని కాక్రోచ్ పార్టీ తేల్చి చెప్పిన‌ట్లు స‌ద‌రు వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ప్ర‌ధాన్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి..

మ‌రోవైపు రాహుల్ గాంధీ సైతం ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాకు బ‌దులు ఆయ‌న శాఖ మార్పుకు మోదీ స‌ర్కార్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని రాహుల్ తెలిపారు. ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్న‌దే విద్యార్థుల డిమాండ్ అని చెప్పారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆయ‌న్ని మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల్సిందేన‌ని ప్ర‌తిప‌క్ష నేత తేల్చి చెప్పారు. ఓవైపు సీజేపీ, మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌తో ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ మంత్రిప‌ద‌వి నుంచి దిగిపోవాల్సి వ‌చ్చింది.

నేను స్ట్రీట్‌ ఫైటర్‌ను.. విప‌క్షాల‌కు ధ‌ర్మేంద్ర కౌంట‌ర్‌

రాజీనామా త‌ర్వాత నిన్న ఎంపీ హోదాలో తొలిసారి పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌. ఈ సంద‌ర్భంగా ఊహించ‌ని రీతిలో ఆయ‌న‌కు ఎన్డీయే మిత్ర‌ప‌క్ష ఎంపీలు స్వాగ‌తం ప‌లికారు. "ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్" అంటూ నినాదాలు చేస్తూ ఆయనను లోపలికి తోడ్కొని వెళ్లారు. సంప్ర‌దాయ టోపీ పెట్టి స‌త్క‌రించారు. క‌ష్ట‌స‌మ‌యంలో అండ‌గా ఉంటామ‌నే భ‌రోసా ఇచ్చారు. అదే స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్‌.. "ఇలా జరుగుతూ ఉంటుంది" అని అన్నారు. స్పందించిన ధర్మేంద్ర "ఏమీ జరగలేదు.. నేను స్ట్రీట్‌ ఫైటర్‌ను. ఏసీ గదుల్లో కూర్చునే కార్యకర్తను కాదు" అంటూ కౌంట‌ర్ ఇచ్చారు.

Also Read..

నీట్ మంట‌లు.. ఉభ‌య‌స‌భ‌లు మ‌ళ్లీ వాయిదా.. మ‌ధ్యాహ్నం లోక్‌స‌భ‌లో పేప‌ర్ లీక్ బిల్లుపై చ‌ర్చ‌

ప్ర‌ధాని మోదీ సెల్ఫీ వీడియో తొల‌గింపు.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా

అమ‌ర్‌నాథ్ యాత్రికుల బ‌స్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Advertisement
Advertisement