RAAKA | బన్నీ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?
RAAKA | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘రాకా’పై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Entertainment | Published On Jul 29, 2026, 10.01 pm IST
RAAKA | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘రాకా’పై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రాకా’ను ఒకే భాగంగా కాకుండా రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు భాగాల కోసం కలిపి దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి అధికారికంగా స్పందించాల్సి ఉంది.
రెండు విభిన్న ప్రపంచాలు..
అట్లీ తనదైన శైలిలో కథను రెండు విభిన్న ప్రపంచాలుగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక భాగం చారిత్రక నేపథ్యంతో పాటు ఫాంటసీ అంశాల కలయికలో సాగుతుందని, మరో భాగం పూర్తిగా భవిష్యత్ ప్రపంచాన్ని చూపించే ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఒక భాగంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అల్లు అర్జున్‌కు జోడీగా కనిపించనుండగా.. మరో భాగంలో మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రత్యేకపాత్రలో షారుఖ్
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్‌లో షారుఖ్ నటించి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ‘రాకా’లోనూ ఆయన భాగస్వామ్యం ఉండొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు సినిమా విడుదల విషయంలోనూ చిత్ర బృందం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. రెండు భాగాల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసి, తక్కువ వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘రాకా’పై అల్లు అర్జున్ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!
- ●Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం
- ●NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?
- ●FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!
- ●Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!
- ●CM Revanth Reddy | నిమ్జ్‌లో హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం

Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!

Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం

NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?

FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!




