Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
Garuda Seva | తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనసేవ కనుల పండువగా సాగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామివారు స్వర్ణకాంతులతో మెరిసే గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగిన ఈ వాహనసేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Devotional | Published On Jul 29, 2026, 8.32 pm IST
Garuda Seva | తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనసేవ కనుల పండువగా సాగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామివారు స్వర్ణకాంతులతో మెరిసే గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగిన ఈ వాహనసేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో ఆలయ మాడవీధులన్నీ మార్మోగాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా గరుడునిపై కొలువుదీరిన మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
వేదఘోష, మంగళవాయిద్యాలు, అర్చకుల ఆశీర్వచనాల నడుమ స్వామివారి ఊరేగింపు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. వైష్ణవ సంప్రదాయంలో గరుడసేవకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. మహావిష్ణువు వాహనమైన గరుడుడిపై స్వామివారు దర్శనమివ్వడం శుభప్రదంగా, పాప విమోచనాన్ని కలిగించేదిగా భక్తులు విశ్వసిస్తారు. గరుడ వాహనంపై స్వామివారిని దర్శిస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందని ఆగమశాస్త్రాలు పేర్కొంటాయి. అందుకే ఈ సేవకు ప్రతి ఏడాది విశేషంగా భక్తులు తరలివస్తుంటారు. అలాగే, ప్రతి పౌర్ణమి రోజుల్లోనూ గరుడ సేవ జరుగుతుంది.
తాజావార్తలు
- ●Bonalu | న్యూయార్క్లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి
- ●TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
- ●Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..
- ●CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు
- ●Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన
- ●Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!

Bonalu | న్యూయార్క్లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి

TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!

Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..

CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు




