PM Modi | ప్రధాని మోదీ అరుదైన ఘనత.. నెహ్రూ రికార్డు బద్దలు.. ఎన్డీయే పాలనకు 12 ఏళ్లు
PM Modi | ప్రధాన మంత్రి (prime minister) నరేంద్ర మోదీ (PM Modi) అరుదైన ఘనత సాధించారు. సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రిగా రికార్డు నెలకొల్పారు (unbroken tenure).
PM Modi | ప్రధాన మంత్రి (prime minister) నరేంద్ర మోదీ (PM Modi) అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి.. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో రికార్డు సృష్టించారు. సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రిగా రికార్డు నెలకొల్పారు (unbroken tenure).
2014లో తొలిసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఎలాంటి విరామం లేకుండా 4,399 రోజులు (నేటితో) ప్రధానిగా కొనసాగుతున్నారు. తద్వారా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పేరిట ఉన్న రికార్డును అధిగమించి అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా నిలిచారు. మోదీ ఇంతకుముందు కూడా ప్రధానిగా మరో రికార్డును బద్దలుకొట్టారు. వరుసగా, అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రికార్డును జూలై 5, 2025న దాటేశారు.
1952లో స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది మే 13న ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు (మొత్తం 4,398 రోజులు) ఆ పదవిలో కొనసాగారు. నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ నేడు అధిగమించారు. దీంతో ప్రజల ఓట్లతో ఎన్నికై వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ పేరు చరిత్రలో నమోదైంది. ఇక అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నేతగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మూడో స్థానంలో ఉన్నారు. ఇందిరా గాంధీ 1966 నుంచి 1984 వరకు దాదాపు 14 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. కానీ ఆమె పదవీకాలం నిరంతరాయంగా సాగలేదు. దాదాపు 4,077 రోజుల పాటూ దేశ ప్రధానిగా ఇందిర సేవలందించారు.
ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ..
అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ప్రధానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు ప్రపంచ నేతలు కూడా సోషల్ మీడియా ద్వారా మోదీకి కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఎన్డీయేకి 12 ఏండ్లు..
భారత రాజకీయ చరిత్రలో జూన్ 10 ప్రత్యేకమైన రోజుగా నిలిచింది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పలు రంగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా భారతదేశాన్ని డిజిటల్ చెల్లింపుల విప్లవంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపారు. 'వన్ నేషన్.. వన్ టాక్స్' విధానంతో దేశ పన్నుల వ్యవస్థను సరళీకృతం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వేలు, జాతీయ రహదారుల విస్తరణ, సెమీకండక్టర్ తయారీపై దృష్టి, తయారీ రంగానికి ప్రోత్సాహం, స్టార్టప్ వ్యవస్థ బలోపేతం వంటి కీలక సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాయి. ఇలా.. నేటితో12 ఏళ్ల మోదీ పాలన పూర్తవడం, నెహ్రూ రికార్డును అధిగమించడం భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది.

Also Read..
అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు.. దేశీయ మార్కెట్లు లాభాల్లోనే..
4,399 రోజులు.. భారతీయ నాగరికత చరిత్రలో స్వర్ణయుగం: రామచందర్‌రావు
జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!
సంబంధిత వార్తలు

Delhi Police | ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు
జులై 29, 2026

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
జులై 28, 2026

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
జులై 28, 2026
తాజావార్తలు
- ●Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
- ●RAAKA | బన్నీ అభిమానులకు గుడ్న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!
- ●Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!

RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ

RAAKA | బన్నీ అభిమానులకు గుడ్న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?

Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!



