Delhi Police | ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు
Delhi Police | సీజేపీ ఆందోళనల (CJP Protests) సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అభ్యంతరకర, దూషణాత్మక పోస్టులు ప్రచురించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) చర్యలు చేపట్టారు.
Delhi Police | సీజేపీ ఆందోళనల (CJP Protests) సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అభ్యంతరకర, దూషణాత్మక పోస్టులు ప్రచురించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) చర్యలు చేపట్టారు. ఆయా సోషల్ మీడియా ఖాతాలతోపాటూ కొన్ని న్యూస్ పోర్టళ్లకు నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అవమానకరమైన, దురుద్దేశపూర్వకమైన, పరువునష్టం కలిగించేలా పెట్టిన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్, మెటా వంటి సంస్థలకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించడంతో పాటు వాటిని అప్‌లోడ్ చేసిన ఖాతాల పూర్తి వివరాలను అందించాలని కోరారు.
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయనే ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ అంశంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసినట్లు తెలిపారు.
Also Read..
బ్లాక్‌సీలో ఉద్రిక్తత.. కార్గో నౌకలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు
పీవోకే నిరసనకారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కొండగట్టు అంజన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ.. పాల్గొన్న మంత్రులు.. ఫొటోలు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే
- ●ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం






