త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Tummala | మోదీ జీ స‌మ‌యం ఇవ్వండి.. అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని మంత్రి తుమ్మ‌ల రిక్వెస్ట్‌..!

Minister Tummala | దేశంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ, రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన విధాన నిర్ణయాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు బుధవారం లేఖలు రాశారు.

P

Telangana | Published On Jul 29, 2026, 9.30 pm IST

Minister Tummala | మోదీ జీ స‌మ‌యం ఇవ్వండి.. అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని మంత్రి తుమ్మ‌ల రిక్వెస్ట్‌..!
Advertisement

Minister Tummala | దేశంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ, రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన విధాన నిర్ణయాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు బుధవారం లేఖలు రాశారు. ప్రధాని ప్రారంభించిన **నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌–ఆయిల్‌పామ్‌ (NMEO-OP) దేశాన్ని వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లే కీలక కార్యక్రమమని తుమ్మల పేర్కొన్నారు. ఈ పథకం అమలులో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని, దేశంలో ఇప్పటివరకు సాగులోకి వచ్చిన ఆయిల్‌పామ్‌ విస్తీర్ణంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 75 శాతం ఉందని తెలిపారు.

తెలంగాణలో కేంద్రం నిర్దేశించిన 1.45 లక్షల హెక్టార్ల ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యానికి గాను 0.98 లక్షల హెక్టార్లలో ఇప్పటికే సాగు చేపట్టామని, దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి వివరించారు. అయితే, ఆయిల్‌పామ్‌ రైతులకు కనీస హామీ ధర (MGP), దిగుమతి సుంకాలపై స్థిరమైన విధానం, నాణ్యమైన మొలకల సరఫరా, NMEO-OP కింద ఆర్థిక సహాయం వంటి అంశాల్లో స్పష్టమైన విధాన నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు. రైతులకు దీర్ఘకాలిక భరోసా కల్పిస్తేనే ఆయిల్‌పామ్‌ సాగు మరింత విస్తరిస్తుందని, దేశం వంటనూనెల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల సమయంలోనే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందానికి ప్రధానమంత్రిని కలిసే అవకాశం కల్పించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.

ఆయిల్‌పామ్‌ రంగ అభివృద్ధికి అవసరమైన సూచనలు, రైతుల సమస్యలను నేరుగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు కూడా తుమ్మల లేఖ రాశారు. ప్రధానమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో సహకరించాలని కోరారు. ఈ భేటీ ద్వారా ఆయిల్‌పామ్‌ సాగును మరింత బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయ వృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement