Trinamool MP | టీఎంసీకి మరో షాక్.. మరో ఎంపీ రాజీనామా
Trinamool MP | పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC)కి షాకులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కీలక నేత సుస్మితా దేవ్ (Sushmita Dev) రాజ్యసభ సభ్యత్వంతోపాటూ, పార్టీలోని అన్ని పదవులకూ రాజీనామా చేశారు.
Trinamool MP | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి (Mamata Banerjee) షాకులమీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సంక్షోభం పార్లమెంటును కూడా తాకింది. ఇప్పటికే ఓ రాజ్యసభ ఎంపీ (Rajya Sabha MP) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎంపీ (Trinamool MP) రాజీనామా చేశారు.
పార్టీలో కీలక నేత సుస్మితా దేవ్ (Sushmita Dev) రాజ్యసభ సభ్యత్వంతోపాటూ పార్టీలోని అన్ని పదవులకూ రాజీనామా చేసినట్లు బుధవారం ప్రకటించారు. కాగా, రెండు రోజుల క్రితం దీదీకి అత్యంత నమ్మకస్థుడుగా పేరొందిన సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడం గమనార్హం. మరోవైపు దాదాపు 20 మంది లోక్‌సభ రెబల్ టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాశారు.
ఇక సుస్మితా దేవ్.. గతంలో అస్సాంలోని సిల్చార్ నుంచి కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీని వీడి.. 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత పార్టీలో బలమైన నేతగా ఎదిగారు. జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టడమేకాకుండా.. రాజ్యసభ స్థానాన్ని కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె రాజీనామాతో పార్టీకి గట్టి షాక్ తగిలినట్లైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరికొంత మంది ఎంపీలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TMC MP Sushmita Dev resigns as a member of the Rajya Sabha pic.twitter.com/t801nkdWnx
— ANI (@ANI) June 10, 2026
Also Read..
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. నెహ్రూ రికార్డు బద్దలు.. ఎన్డీయే పాలనకు 12 ఏళ్లు
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సిగ్గుచేటు: టీపీసీసీ నేత చనగాని దయాకర్
రెయిన్ అలర్ట్.. మధ్యాహ్నం తర్వాత ఈ జిల్లాల్లో భారీ వర్షం
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్దేవ్పల్లి పోలీసులు
- ●Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?
- ●Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు - విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట
- ●RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్
- ●Minister Ponguleti | భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం
- ●International Tiger Day | దేశంలో పులులు 3,682

Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్దేవ్పల్లి పోలీసులు

Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?

Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు - విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట

RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్






