RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
RRR | హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర కారిడార్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో గణనీయమైన పురోగతి సాధించినట్లు రాజ్యసభలో వెల్లడించారు.
RRR | హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర కారిడార్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో గణనీయమైన పురోగతి సాధించినట్లు రాజ్యసభలో వెల్లడించారు. బీజేపీ సభ్యుడు కే లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన 161.518 కిలోమీటర్ల ఆరు లేన్ల రహదారి కోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) సిద్ధమైందన్నారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ద్వారా రూ.23,935.60 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయాలని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలించిందని తెలిపారు.
భూసేకరణలో భాగంగా మొత్తం అవసరమైన భూమిలో 99.06 శాతం మేర నోటిఫికేషన్లు జారీ చేయగా, 87.19 శాతం భూమికి అవార్డులు ప్రకటించినట్లు గడ్కరీ వెల్లడించారు. అయితే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కాలపట్టికను డీపీఆర్, ఫీజిబిలిటీ అధ్యయనం, సంబంధిత అధికారుల తుది ఆమోదం అనంతరం ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ ఇంకా తుది దశకు చేరలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. వీటి కింద 270.77 కిలోమీటర్ల రహదారులను రూ.10,772.24 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో రహదారి మౌలిక సదుపాయాల విస్తరణకు ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని కేంద్రం పేర్కొంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
- ●Vaishnavi Chaitanya | వయసుపై తప్పుడు ప్రచారం - ఆధార్ కార్డ్‌తో క్లారిటీ ఇచ్చిన బేబీ హీరోయిన్
- ●Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు

Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..

Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం





