PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
PM Modi | విద్యార్థి నిరసనకారులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగించిన ఓ వీడియో ఫేస్‌బుక్ (Facebook) నుంచి తొలగించడం (Modis selfie video removed) వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా క్షమాపణలు (Meta apologises) చెప్పింది.
PM Modi | సీజేపీ ఆందోళనల సమయంలో విద్యార్థి నిరసనకారులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగించిన ఓ వీడియో ఫేస్‌బుక్ (Facebook) నుంచి తొలగించడం (Modis selfie video removed) వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆ వీడియోని మెటా పునరుద్ధరించినప్పటికీ ఈ ఘటన అప్పటికే తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మెటా (Meta) తాజాగా స్పందించింది. ఈ మేరకు క్షమాపణలు (Meta apologises) చెప్పింది.
పేపర్ లీకేజీలు, దేశ విద్యావ్యవస్థలో అక్రమాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. అనూహ్యంగా అర్ధరాత్రి వేళ సోషల్ మీడియాలో జెన్ జెడ్‌ను ఉద్దేశించి ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. అయితే, ఈ వీడియోని మంగళవారం తెల్లవారుజామున మెటా ఆధీనంలోని ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ తాత్కాలికంగా నిలిపివేసింది.
దీనిపై నెటిజన్లు, అధికార పక్ష నేతల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వెంటనే స్పందించిన మెటా ఆ వీడియోను పునరుద్ధరించింది. పొరపాటున వీడియో తొలగించినట్లు చెప్పింది. ఈ మేరకు ఘటనకు గానూ క్షమాపణలు చెప్పింది. తొలగించిన వీడియోని రీస్టోర్ చేసినట్లు మెటా ప్రతినిధి వివరణ ఇచ్చారు. మరోవైపు ప్రధాని ప్రసంగం వీడియోని తొలగించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా మెటా ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
Also Read..
అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
- ●Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
- ●RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్
- ●Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!
- ●TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..

RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్






