Asia’s 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్‌మేకర్’..!
Asia's 50 Best Bars 2026 | ఆసియాలో అత్యుత్తమ బార్లలో భారత్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రతిష్ఠాత్మక ‘ఆసియాస్ 50 బెస్ట్ బార్స్–2026’ జాబితాలో చెందిన మూడు బార్లు చోటు దక్కించుకోగా.. గోవాలోని ‘బాయిలర్‌మేకర్’ టాప్-10లో స్థానం సంపాదించి దేశంలోనే ఉత్తమ బార్‌గా గుర్తింపు పొందింది.
Asia's 50 Best Bars 2026 | ఆసియాలో అత్యుత్తమ బార్లలో భారత్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రతిష్ఠాత్మక ‘ఆసియాస్ 50 బెస్ట్ బార్స్–2026’ జాబితాలో చెందిన మూడు బార్లు చోటు దక్కించుకోగా.. గోవాలోని ‘బాయిలర్‌మేకర్’ టాప్-10లో స్థానం సంపాదించి దేశంలోనే ఉత్తమ బార్‌గా గుర్తింపు పొందింది. బెంగళూరుకు చెందిన మరో రెండు బార్లు కూడా జాబితాలో నిలిచి నగరాన్ని కాక్‌టెయిల్ సంస్కృతికి కేంద్రంగా నిలిపాయి. మకావోలోని విన్ ప్యాలెస్‌లో జూలై 28న జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఈ ర్యాంకులను ప్రకటించారు. గోవాలోని బాయిలర్‌మేకర్ ఎనిమిదో స్థానంలో నిలిచి ‘బెస్ట్ బార్ ఇన్ ఇండియా’ అవార్డును సొంతం చేసుకుంది. బెంగళూరులోని సోకా 18వ ర్యాంక్, బార్ స్పిరిట్ ఫార్వర్డ్ 30వ ర్యాంక్‌తో జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఈ ఏడాది ఆసియాలో అత్యుత్తమ బార్‌గా చైనాలోని గ్వాంగ్‌జౌకు చెందిన ‘హోప్ అండ్ సెసేమ్’ నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి చైనా బార్‌గా అది రికార్డు సృష్టించింది. గోవా స్థానిక సంస్కృతి, బీచ్ వాతావరణాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కాన్సెప్ట్‌తో బాయిలర్‌మేకర్ పేరు తెచ్చుకుంది. మరోవైపు వినూత్న కాక్‌టెయిల్స్, ఆధునిక ఇంటీరియర్‌తో సోకా ఆకట్టుకుంటుండగా, క్లాసిక్ డ్రింక్స్‌కు కొత్త రూపం ఇచ్చే ప్రయత్నాలతో బార్ స్పిరిట్ ఫార్వర్డ్ ప్రత్యేక గుర్తింపు పొందింది. గత ఏడాది ఈ జాబితాలో భారత్‌కు ఐదు స్థానాలు దక్కినా, ఈసారి సంఖ్య మూడుకు తగ్గింది. అయినప్పటికీ టాప్-10లో భారత బార్ నిలవడం విశేషంగా మారింది. అలాగే బెంగళూరు నుంచి రెండు బార్లు ఎంపిక కావడం ఆ నగరం ఆసియాలో వేగంగా ఎదుగుతున్న కాక్‌టెయిల్ గమ్యస్థానంగా మారుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది టాప్-50 జాబితాలో బ్యాంకాక్‌కు చెందిన ఎనిమిది, హాంకాంగ్‌కు చెందిన ఏడు బార్లు చోటు దక్కించుకున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
- ●RAAKA | బన్నీ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!
- ●Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
- ●Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!

RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ

RAAKA | బన్నీ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?

Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!

Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట



